ఆర్ ఆర్ ఆర్ లో జూనియర్ కు జోడీ కుదిరిందా..?

209
RRR Movie updates : rajamouli finalised british actress to romance with jr ntr in rrr
RRR Movie updates : rajamouli finalised british actress to romance with jr ntr in rrr

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’లో. ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్‌ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. పీరియాడిక్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ నటిస్తున్నారు.

ఈసినిమలో కొమరం భీం పాత్రలో నటిస్తున్న జూనియర్ సరసన బ్రిటిష్ నటిని రాజమౌళి ఖరారు చేసినట్లు చిత్ర వర్గాల ద్వారా తెలిసింది. గతంలో జూనియర్ సరసన బ్రిటిష్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్ పేరును రాజమౌళి ప్రకటించారు. కానీ, వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.

ఆ తరవాత అమెరికన్ నటి, సింగర్ ఎమ్మా రాబర్ట్స్‌ను రాజమౌళి ఫైనల్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఆమె కూడా డేట్స్ సర్దుబాటు చేసుకోలేక రాజమౌళికి నో చెప్పిందని అన్నారు. దీంతో మళ్లీ వేట మొదలుపెట్టిన రాజమౌళి ఎట్టకేలకు ఒక బ్రిటిష్ అమ్మాయిని ఫైనల్ చేశారని అంటున్నారు. అయితే, ఆమె ఎవరనే విషయాన్ని గోప్యంగా ఉంచారు.

వచ్చే నెలలో ఆ భామ ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో కూడా జాయిన్‌ అవుతుందన్న టాక్‌ వినిపిస్తోంది. మరి ఆ భామ ఎవరు..? అన్న విషయం తెలియాలంటే మాత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ టీం నుంచి అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ వచ్చేవరకు ఆగాల్సిందే.

Loading...