Friday, April 26, 2024
- Advertisement -

ఓ బేబి రివ్యూ

- Advertisement -

అక్కినేని సమంత ప్రధాన పాత్ర లో తెలుగు లో మన ముందుకు వచ్చిన చిత్రం ఓ బేబీ. ఎన్నో ఏళ్ళ నుండి కొరియా లో విడుదల అయ్యి విజయం సాధించిన ‘మిస్ గ్రానీ’ అనే సినిమా ని తెలుగు లో చేయాలి అని అనుకున్న సమంత మొత్తానికి ఈ ఏడాది ఆ కోరిక ని తీర్చుకుంది. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, లక్ష్మి, నాగ శౌర్య మొదలగువారు ఇతర పాత్రల్లో నటించారు. నందిని రెడ్డి దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ తో సహా మరో ముగ్గురు నిర్మాతలు నిర్మించారు. మొదటి నుండి ఈ సినిమా కి పాజిటివ్ బజ్ ఉండటం సినిమాకి కలిసి వచ్చే అంశం. ఇప్పుడు ఈ సినిమా సమీక్ష విషయానికి వస్తే..

కథ:
బేబీ (లక్ష్మి) అందరినీ విసిగిస్తూ జీవినం సాగించే ఒక ముసలావిడ. అయితే తన కుటుంబం లో అందరికీ బేబీ అంటే అంత ఇష్టం ఉండదు. ఒకానొక టైం లో బేబీ ఇంటి నుండి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే అనుకోకుండా బేబీ ఒక యుక్త వయస్కురాలి బాడీ లో కి ప్రవేశించి మరలా యవ్వనం లో ఉన్న బేబీ (సమంత) లాగా తన ఇంటికే తిరిగి వెళ్ళి వాళ్ళతో అద్దెకి వచ్చిన అమ్మాయి లా గా కలుస్తుంది. అసలు బేబీ సమస్య ఏంటి? మళ్ళీ ఇంటికి ఎందుకు వెళ్ళింది? ఆ తర్వాత ఏం చేసింది? అనేది సినిమా కథ.

నటీనటులు:
సమంత నటన ఈ సినిమాకి వెన్నెముక లాంటిది అని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా యంగ్, ఎనర్జిటిక్ హీరోయిన్ పాత్రలలో మెరిసిన సమంత ఈ సినిమాలో 24 ఏళ్ల అమ్మాయిగా మారిపోయిన 70 ఏళ్ల ముసలవిడ లాగా చాలా అద్భుతంగా నటించింది. సీనియర్ నటి లక్ష్మి ఎప్పటిలాగానే తన పాత్ర లో ఒదిగిపోయి చాలా చక్కగా నటించారు. నాగ శౌర్య నటన బాగుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాల్లో నాగశౌర్య అద్భుతమైన నటనను కనబరిచాడు. రాజేంద్ర ప్రసాద్ తన పాత్రకు ఊపిరి పోశారు అని చెప్పవచ్చు. రాజేంద్రప్రసాద్ తెరపై ఉన్నంతసేపు ప్రేక్షకులలో నవ్వుల పువ్వులు పూయిస్తూనే ఉంటారు. సమంత కొడుకు పాత్రలో రావు రమేష్ చాలా బాగా నటించారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎమోషనల్ సన్నివేశాల్లో రావు రమేష్ నటన అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రగతి కూడా చాలా సహజంగా నటించింది. ఇప్పటిదాకా చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రతిభ చాటిన తేజ ఈ సినిమాతో సమంత మనవడి పాత్రలో చాలా బాగా నటించాడు.

సాంకేతిక వర్గం:
రీమేక్ సినిమా అయినప్పటికీ దర్శకురాలు నందిని రెడ్డి సినిమా కథను తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా బాగా కనెక్ట్ అయ్యే విధంగా చాలా చక్కగా తెరకెక్కించారు. ప్రతి సన్నివేశం మనసుకు హత్తుకునేలా ఉంటుంది. కథను చాలా బాగా తెరకెక్కించిన పూర్తి క్రెడిట్ దర్శకురాలు నందిని రెడ్డి కి ఇవ్వచ్చు. సురేష్ బాబు మరియు సునీత తాటి అందించిన నిర్మాణ విలువలు సినిమాకి బాగా వర్కవుట్ అయ్యాయి. లక్ష్మీ భూపాల్ రాసిన డైలాగ్స్ సినిమాకి మరింత ప్లస్ అయ్యాయి. మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం సినిమా లోని ప్రతి ఎమోషన్ ని చాలా బాగా ఎలివేట్ చేసింది. అన్ని పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అంతేకాకుండా మిక్కీ అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమా చాలా బాగుంది. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అద్భుతం. ప్రతి ఫ్రేమ్ ఒక అందమైన పెయింటింగ్ లాగా అనిపిస్తుంది. జునైద్ సిద్ధికీ ఎడిటింగ్ కూడా బాగుంది.

తీర్పు:
సినిమా మొదటి నుంచి ఆఖరి వరకు సరదా సరదాగా సాగిపోయినప్పటికీ ఆఖరి లో క్లైమాక్స్ సన్నివేశం అందరినీ కన్నీళ్లు పెట్టుకునేలా చేస్తుంది. సినిమా కథ చాలా సింపుల్గా అనిపించినప్పటికీ ప్రేక్షకుల మనసుని ప్రభావితం చేసే లాగా ఉంది. ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమా మొదటి హాఫ్ మొత్తం చాలా సరదా సరదాగా, లైట్ హార్టెడ్ కామెడీతో సాగిపోతుంది. రెండవ హాఫ్ కూడా అలానే కామెడీ, రొమాన్స్ తో సాగిపోయే ఈ చిత్రం క్లైమాక్స్ సీన్ లో మాత్రం మనసుని తాకే విధంగా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో సమంత చెప్పే డైలాగులు, సమంత, రావు రమేష్ మధ్య సన్నివేశం సినిమాకి ఆయువు పట్టు అని చెప్పవచ్చు. చివరిగా సినిమా తప్పకుండా అందరూ అన్ని వర్గాల ప్రేక్షకులు చూడవలసిన మంచి కంటెంట్ ఉన్న సినిమా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -