లాంఛనంగా ప్రారంభమైన సత్యదేవ్‌ ‘తిమ్మరుసు’

- Advertisement -

‘బ్లఫ్‌ మాస్టర్‌’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలతో ప్రేక్షకాభిమానుల ఆదరాభిమానాలు పొందుతున్న సత్యదేవ్‌ హీరోగా కొత్త చిత్రం ‘తిమ్మరుసు’ ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిత్ర సినిమాటోగ్రాఫర్‌ అప్పూ ప్రభాకర్‌ క్లాప్‌ కొట్టారు. రాజా, వేదవ్యాస్‌ స్క్రిప్ట్‌ను అందజేశారు.

ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌ నిర్మాత సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ‘తిమ్మరుసు’ చిత్రానికి ‘అసైన్‌మెంట్‌ వాలి’ ట్యాగ్‌లైన్‌.

- Advertisement -

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ” కెరీర్‌ ప్రారంభం నుండి వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ హీరోగా, నటుడిగా..సత్యదేవ్‌ తనకంటూఓ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. అలాంటి హీరో సత్యదేవ్‌తో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ‘తిమ్మరుసు’ సినిమా విషయానికి వస్తే ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీ. సత్యదేవ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా ఇది. మంచి టీమ్‌ కుదిరింది. ఈ నెల 21 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. నిరవధికంగా జరిగే లాంగ్‌ షెడ్యూల్‌లో సినిమా చిత్రీకరణ పూర్తి చేసేలా ప్లాన్‌ చేశాం” అన్నారు.

నటీనటులు:
సత్యదేవ్‌, ప్రియాంకా ఝావల్కర్, బ్రహ్మాజీ, అజయ్‌, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్‌ తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: శరణ్‌ కొప్పిశెట్టి
నిర్మాతలు: మహేశ్‌ కోనేరు, సృజన్‌
సంగీతం: శేఖర్‌ చంద్ర
సినిమాటోగ్రఫీ: అప్పూ ప్రభాకర్‌
ఆర్ట్‌: కిరణ్‌ కుమార్‌ మన్నె
యాక్షన్‌: రియల్‌ సతీశ్‌
పి.ఆర్‌.ఒ: వంశీకాక

Most Popular

నటి రోహిణి తమ్ముడు టాలీవుడ్ లో పెద్ద విలన్ అని తెలుసా ?

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు డైరెక్షన్లో వచ్చిన “ఓ మగాడు ఆడది” అనే సినిమా ద్వారా విలన్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు నటుడు బాలజీ. తర్వాత చిరంజీవి,...

షియాజీ షిండే సినిమాల్లోకి రాకముందు ఏం పని చేశేవారో తెలుసా ?

దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించినటు వంటి ఠాగూర్ చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది. ఈ సినిమాలో విలన్ గా షియాజీ షిండే నటించాడు. ఈ...

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి నో ఎలిమినేషన్..?

బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే డేంజర్ జోన్ లో ఇద్దరు సభ్యులు ఉన్నారు. మోనాల్...

Related Articles

బ్రహ్మాజీ పిల్లలను ఎందుకు వద్దనుకున్నాడో తెలుసా ?

తెలుగులో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తదితర పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు ప్రముఖ నటుడు బ్రహ్మాజీ. తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ...

30 రోజుల్లో ప్రేమించడం ఎలా ను రిజెక్ట్ చేసిన సత్యదేవ్..!

యాంకర్ ప్రదీప్ హీరోగా మారుతూ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. మున్నా దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా...

సత్యదేవ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకు ?

ఇండస్ట్రీలో ట్యాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఈ లాక్ డౌన్లో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అదుకున్నాడు. ఈ సినిమాని ‘కేరాఫ్ కంచెరపాలెం’...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...