అలీ ఎవరిని టార్గెట్ చేసి ఇంట్లోకి వచ్చాడు ?

2430
SriMukhi or ShivaJyothi Who is Ali Target ?
SriMukhi or ShivaJyothi Who is Ali Target ?

అలీ రెజా బిగ్ బాస్ ఇంట్లోకి లాస్ట్ వైల్డ్ కార్డు ఎంట్రీ. తన పొగరు, నోటిదురుసుతనంతో ఎలిమినేట్ అయిన అలీ.. కేవలం మూడు వారాల్లోనే
వైల్డ్ కార్డు ఎంట్రీతో మళ్ళీ రావడం కొంతమంది అభిమానులలో ఆనందం నింపింది. కానీ అలీ ఇంట్లోకి రావడం శ్రీముఖి అసలు జీర్ణించుకోలేకపొయ్యింది. ముందు అలీ ఎంట్రీతో హ్యాపీగా ఉన్నట్టు కనపడినా కూడా కేవలం రెండు రోజుల్లోనే తన అక్కసునంతా బయటపెట్టేసింది శ్రీముఖి. ఆ రోజు నుండి అలీకి శ్రీముఖికి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.

అలీకి బయట ఏం అర్థం అయ్యిందో తెలియదు కానీ ఇంట్లోకి రాగానే వరుణ్ గ్రూప్ పంచన చేరాడు. ఇక మొదలు అలీ, రాహుల్, వరుణ్, వితిక, పునర్నవి, మహేష్ అంతా కలిసి శ్రీముఖి మీద కారాలు మిరియాలు నూరే పనిలో పడ్డారు. శ్రీముఖి అసలు తగ్గే ఛాన్సే లేదు ఇటు బాబా మాస్టర్ దగ్గర ఆవిడ కూడా అదే పని చేస్తుంది. ప్రస్తుతం అలీ ఇంట్లో అందరికీ శ్రీముఖి కి బయట బ్యాడ్ నేమ్ ఉంది అని ప్రచారం చేస్తున్నాడు. అలీ ఇంట్లోకి వచ్చింది కేవలం శివజ్యోతిని గెలిపించడానికే అనేది శ్రీముఖి వాదన. ఈ వాదనతోనే నిన్నటి ఎపిసోడ్ లో గొడవ భారీగా జరిగింది.

ఇప్పుడు అసలు తెలియాల్సిన, తేలాల్సిన విషయం ఏంటంటే అలీ ఎందుకు వచ్చాడు, టైటిల్ కోసం అయితే తన ఆట తను ఆడాలి కానీ శివజ్యోతి ఆట ఎందుకు ఆడుతున్నాడు. అసలు అలీకి శ్రీముఖి మీద అంత కోపం ఎందుకు వస్తుంది, శ్రీముఖి అలీ ఎలిమినేషన్ కి ముందు కానీ తరువాత కానీ అలీ గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడింది లేదు. ఇక్కడ ఇప్పుడు ఏం జరిగినా టైటిల్ విన్నర్ ఒక్కరే… అది అలీ గుర్తించాలి.

Loading...