Friday, April 26, 2024
- Advertisement -

విజయ నిర్మల మరణం పై కృష్ణ ఏమన్నారంటే

- Advertisement -

తెలుగు సినిమా లో మహిళా దర్శకులు చాలా తక్కువ. అయినప్పటికీ విజయ నిర్మల తనదైన ముద్ర వేసి అత్యధిక సినిమాల కి దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. ఇది మాములు విషయం కాదు. అయితే అనూహ్యం గా అనారోగ్యం పాలై ఆమె మరణించిన విషయం అందరినీ షాక్ కి గురి చేసింది. ఇక పోతే ఆమె మరణం సూపర్ స్టార్ కృష్ణ ని బాగా కలచివేసింది. చాలా ఏళ్ళు కలిసి ప్రయాణం చేసి, తన తో ప్రతీ ఫంక్షన్ కి వచ్చే విజయ నిర్మల ఇప్పుడు కృష్ణ ని వీడి వెళ్లిపోవడం ఆయన ని చాలా బాధ కి గురిచేస్తుంది.

అయితే ఆయన ఆవిడ మరణం గురించి ఇటీవలే ఒక పత్రిక తో మాట్లాడారు. విజయ నిర్మల మరణం తర్వాత ఆయన మొదటి సారి మీడియా తో మాట్లాడుతూ తన భార్య గురించి గొప్పగా మాట్లాడుతూ, ఆమె చివరి రోజుల్లో బాధ పడిన విషయాల గురించి తెలియజేసారు. సాధారణం గా చాలా మంది చెప్పే విషయం,విజయ నిర్మల కి జ్ఞాపక శక్తీ ఎక్కువ అని. ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలని కూడా ఆవిడ బాగా గుర్తు చేసుకుంటారు అని.

అలాంటి విజయ నిర్మల చివరి రోజుల్లో అల్జీమర్స్ సమస్యతో బాధపడిందని కృష్ణ తెలిపారు. జ్ఞాపకశక్తి బాగా లోపించిందని, చాలా విషయాలు మర్చిపోయిందని ఆయన చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -