Friday, April 26, 2024
- Advertisement -

ఇద్దరం కలిసి పబ్స్ షికార్లకు వెళ్తాం.. మీకెందుకు : సురేఖావాణి

- Advertisement -

సురేఖావాణి.. టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లతో పాటు సమానంగా క్రేజ్ తెచ్చుకుంది ఈమె. సురేఖాను అందమైన ఆర్టిస్టుగా అందరూ పిలుస్తుంటారు. ఎల్లప్పుడూ సినిమాలలో తెలుగుదనం నిండిన పాత్రలలో అభిమానులను సురేఖావాణి అలరిస్తోంది. ముఖ్యంగా తల్లిగా అక్కగా వదినగా ఇలా ఇచ్చిన ప్రతి క్యారెక్టర్ లో ఒదిగిపోయే నటిస్తోంది.

కానీ సురేఖావాణి అంటే కేవలం తెలుగుదనమే కాదు ఆమెలో ఒక ఈతరం మోడ్రన్ మదర్ కూడా ఉంది. ఈ మద్య కాలంలో సినిమాల్లో ఎక్కువ కనిపించడం లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ కనిపించేస్తోంది. చిన్న చిన్న డ్రేస్ లు వేసుకుంటూ యూత్ ని పిచ్చేక్కిస్తోంది. మోడ్రన్ డ్రెస్సులతో స్టైలిష్ ఫోటోషూట్లతో ఇంస్టాగ్రామ్ మొత్తం సెగలు పుట్టిస్తుంది. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు సురేఖావాణి ఆంటీనా.. అమ్మాయా అని. సురేఖావాణి తన ఇంస్టాగ్రామ్ లో అప్పుడప్పుడు తన కూతురుతో దిగిన ఫోటోలను షేర్ చేస్తుంది. అయితే కూతురిని ఎంత మోడ్రన్ గా పెంచుతుందో.. తాను కూడా కూతురితో మోడ్రన్ గా తయారవుతుంది.

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కూతురితో పాటు అలా మీరు కూడా ఏంటని ప్రశ్నిస్తే.. “నా జీవితం నా ఇష్టం నాకు నచ్చినట్లు నేను జీవిస్తాను. నా జీవితాన్ని నా కూతురిని ఎవరు ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఇద్దరం కలిసి పబ్స్ షికార్లు సినిమాలు ఇలా అన్నింటికీ వెళ్తాము. నన్ను నా తల్లి ఎలా పెంచిందో.. నేను నా కూతురిని అంతే స్వేచ్ఛ భావాలతో పెంచుతాను. ఇంకా నా కూతురిని సినిమాల్లోకి పంపిస్తారా అనే విషయం పై.. పూర్తిగా నా కూతురిపై ఆధారపడి ఉంది. తను వెళ్తానంటే నేను అడ్డు చెప్పను అని సురేఖా చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -