Friday, April 26, 2024
- Advertisement -

రక్తసంబంధానికి కొత్త అర్థం చెప్పిన చిరు..!

- Advertisement -

సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు మెగాస్టార్​ చిరంజీవి, ఆయన అభిమానులు. చిరు బ్లడ్​బ్యాంక్​, ఐబ్యాంక్​ పెట్టి ఎన్నో జీవితాలకు ఆయన వెలుగునిచ్చారు. ఇక చిరంజీవి ఫ్యాన్స్​ సైతం సేవ అంటే ముందుంటారు. అయితే కరోనా ఫస్ట్​వేవ్​, సెకండ్​వేవ్​ టైంలో సోనూ సూద్​ పేరు ప్రముఖంగా వినిపించింది. దీంతో చాలా మంది సోనూ సూద్​కు చిరంజీవికి పోలిక పెట్టి చూశారు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్​ నడిచింది. ఇక చిరంజీవి స్వయంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్​ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి విమర్శకులకు సమాధానం చెప్పారు.

ప్రస్తుతం ఆయన సినీ కార్మికులకు సైతం వ్యాక్సినేషన్​ చేయిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇవాళ అంతర్జాతీయ రక్త దాన దినోత్సవం సందర్భంగా చిరంజీవి దంపతులు రక్తదానం చేశారు. ఈ మేరకు చిరంజీవి ట్విట్టర్​లో రక్తదానం చేస్తున్న ఫొటోను పంచుకున్నారు.
‘రక్తదానం చేయడం గొప్ప అదృష్టం. రక్త దానం చేస్తున్న సోదర సోదరీమణులను నేను అభినందిస్తున్నాను. మనతో ఏ సంబంధం లేని వాళ్లకు రక్తదానం చేయడం ద్వారా వారితో మనం రక్త సంబంధం ఏర్పరుచుకోవచ్చు.’ అంటూ రక్తదానం చేసేవారిని పొగిడారు చిరు.

ప్ర‌స్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్​ చివరి దశకు చేరుకున్నది. దసరాకు ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ పూర్తైన వెంటనే ఆయన లూసిఫ‌ర్ రీమేక్ చేయ‌నున్నాడు. ఈ మూవీకి తమిళ డైరెక్టర్ మోహ‌న్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తమిళ వేదాళం రీమేక్ కూడా చిరంజీవి లైనప్ లో ఉంది.

Also Read

బన్నీతో కలసి మెగాస్టార్ తీన్ మార్ స్టెప్పులు.. ఫ్యాన్స్ కిక పండగే..!

స్టార్ హీరోలూ.. రెమ్యూనరేషన్ కాస్త తగ్గించుకోండి బాబూ..

మెగాస్టార్ వర్సెస్ రెబల్ స్టార్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -