Saturday, April 27, 2024
- Advertisement -

కూతురిని ఇలా పెంచుతావా ? అన్నందుకు సురేఖావాణి కౌంటర్

- Advertisement -

సురేఖావాణి.. చాలా సినిమాల్లో చాలా పాత్రలు పోషించింది. కానీ ఈ మధ్య సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా అందరికి టచ్ లోనే ఉంది. తాజగా ఈమెకు సంబంధించిన ఓ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. వయసు పెరుగుతున్నా వన్నెతగ్గని గ్లామర్ సురేఖా వాణి సొంతం. భర్త సురేష్ తేజ అనారోగ్యంతో మరణించడం, సినిమా అవకాశాలు తగ్గడం సురేఖా లైఫ్ లో వెంటవెంటనే జరిగిపోయాయి. ఆయినప్పటికి బాధను దిగమింగుతూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

కాకపోతే హాట్‌నెస్ విషయంలో అస్సలు తగ్గడం లేదు. ఇక తన కూతురు సుప్రితతో కలిసి సురేఖ చేసే హంగామా మామూలుగా ఉండదు. టిక్ టాక్ వీడియోలంటూ నానా రచ్చ చేస్తుంది. చిట్టిపొట్టి దుస్తులు ధరించి దుమ్ములేపేస్తారు తల్లీకూతుళ్లు. ఆ మధ్య కాలా చష్మా, మొన్న బుట్టబొమ్మ అంటూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే సోషల్ మీడియాలో సురేఖ షేర్ చేస్తున్న ఫొటోలు, వీడియోలకు మాత్రం ఎక్కువగా నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి.

కూతురుతో అలాంటి పనులేంటి? ఆ పొట్టి దుస్తులు వేసుకొని ఆ డాన్సులేంటి? అంటూ నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ ఒక కూతురిని ఇలా పెంచకూడదని సురేఖా ఫోస్ట్ పై కామెంట్ పెట్టాడు. ఇది చూసిన సురేఖావాణి వెంట‌నే ఆ నెటిజ‌న్‌కి రిటర్న్ కౌంట‌ర్ ఇచ్చింది. నీలాంటి వీధి కుక్క‌లు లైఫ్ ని చాలా బాగా లీడ్ చేస్తాయి. ”నీ కంటే వీధి కుక్కలు లైఫ్‌ను చాలా బాగా లీడ్ చేస్తాయి. నీ ఆలోచనకు హ్యాట్సాఫ్” అంటూ దిమ్మతిరిగే షాకిచ్చింది. దాంతో ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -