Saturday, April 27, 2024
- Advertisement -

ఎన్టీఆర్ హైట్‌కు అలియా సరిపోతుంది..!

- Advertisement -

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి బాహుబ‌లి సినిమాతో నేషన‌ల్ లేవల్లో క్రేజ్ తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ హీరోగా న‌టించిన బాహుబ‌లి సినిమా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే. ఈ సినిమా త‌రువాత రాజ‌మౌళి భారీ మ‌ల్టీస్టార‌ర్‌కు ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇద్ద‌రిని పెట్టి ఓ సినిమాకు రంగం సిద్ధం చేశాడు రాజ‌మౌళి. ఆర్ఆర్ఆర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లై చాలాకాలం అయింది. కాని ఇప్ప‌టిక వ‌రకు సినిమాలో హీరోయిన్లను ఫిక్స్ చేయ‌లేదు రాజ‌మౌళి. మొద‌ట ఈ సినిమాలో హీరోయిన్లుగా కియారా అద్వానీ, పూజా హెగ్డెలు న‌టిస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అయితే సినిమా మార్కెట్ దృష్ట్యా బాలీవుడ్ హీరోయిన్లు అయితే బాగుంటుంద‌నే ఆలోచ‌న‌లో చేస్తున్నాడ‌ట జ‌క్క‌న్న‌. దీనిలో భాగంగానే అలియా భ‌ట్‌, ప‌ర‌ణితి చోప్రాల‌ను రంగంలోకి తీసుకుచ్చాడు. అయితే వీరి పారితోష‌కం ఎక్కువుగా డిమాండ్ చేయ‌డంతో ఎంపిక కాస్తా ఆల‌స్యం అవుతోంది. తాజాగా సినిమాలో అలియా భ‌ట్‌ను ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అలియా భ‌ట్ ఎవ‌రితో జోడి క‌డుతుందో మాత్రం బ‌య‌టికి చెప్ప‌డం లేదు. అంద‌రు అలియా భ‌ట్ ఎన్టీఆర్‌కు జోడి క‌డుతుంద‌ని భావిస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ హైట్‌కు అలియా అయితేనే బాగుంటుంద‌ని చాలామంది భావిస్తున్నారు. ఏది ఏమైతేనేం మొత్త‌నికి ఓ హీరోయిన్‌ను ఎంపిక మాత్రం పూర్తి చేశాడ‌ని చాలామంది ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -