Friday, April 26, 2024
- Advertisement -

ప్రీ-రిలీజ్ బజ్: వాల్మీకి

- Advertisement -

ఈ మధ్యనే ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యువ హీరో వరుణ్ తేజ్ తాజాగా ఇప్పుడు ఒక గ్యాంగ్స్టర్ అవతారంలో ‘వాల్మీకి’ అనే సినిమాలో కనిపించబోతున్నాడు. తమిళంలో సూపర్హిట్ అయిన ‘జిగర్తాండా’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు ఆధార్వ మురళీ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుండగా పూజా హెగ్డే మరియు మృణాళిని రవి లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

టీజర్ మరియు ట్రైలర్ మాత్రమే కాకుండా ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన జర్రా జర్రా వంటి పాటలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. తాజాగా సినిమా యూనిట్ విడుదల చేసిన ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ అనే పాట కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వరుణ్ తేజ్ కెరీర్ లో మొదటి సారి గా పూర్తి స్థాయి లో వస్తున్న మాస్ చిత్రం ఇదే కనుక ఈ సినిమా మీద భారీ గా అంచనాలు ఉన్నాయి. హరీష్ శంకర్ కి కూడా ఇప్పుడు తన కెరీర్ ని జోరు గా ముందుకు తీసుకొని వెళ్ళడానికి హిట్ అవసరం.

రామ్ ఆచంట మరియు గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 20వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -