ఒకే వేదిక పై సందడి చేయనున్న సంక్రాంతి అల్లుళ్ళు

564
Venkatesh at Valmiki PreRelease Event
Venkatesh at Valmiki PreRelease Event

తెలుగు సినిమా పరిశ్రమ లో ప్రస్తుతం అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో గ్యాంగ్ లీడర్ నిన్న విడుదల అయింది. ఇక వరుణ్ తేజ్ నటించిన సినిమా వాల్మీకి రేపు విడుదల కానుంది. అయితే ఈ సినిమా కి ముందు నుంచి పాజిటివ్ బజ్ ఉంది. ఈ సినిమా కూడా నిజానికి నిన్న నే విడుదల కావాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వలన విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. ఇకపోతే ఈ సినిమా కి సంబందించిన ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగు లో కి వచ్చింది.

ఈ సినిమా కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనం గా రేపు శిల్పకళా వేదిక లో మెగా అభిమానుల మధ్య చేయాలని దర్శక నిర్మాతలు నిర్మించారు. అయితే ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథి గా విక్టరీ వెంకటేష్ ని ఆహ్వానించారు.ఎఫ్2 సినిమా తర్వాత మళ్ళీ వరుణ్ ని వెంకీ ని మనం ఒక స్టేజ్ పైన చూడనున్నాము.

వరుణ్ తేజ్, పూజ హెగ్డే, మృణాళిని రవి, అథర్వ మురళి మరియు డింపుల్ హయాతి లు నటించిన ఈ సినిమా కి దర్శకుడు హరీష్ శంకర్. 14 రీల్స్ ప్లస్ బానర్ పైన ఈ సినిమా ని నిర్మించడం జరిగింది. ఈ సినిమా 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Loading...