Friday, April 26, 2024
- Advertisement -

పోల‌వ‌రంలో భారీ అవినీతి…..బాబులో మొద‌ల‌యిన వ‌ణుకు

- Advertisement -

త్వ‌ర‌లోనె పోల‌వ‌రంలో జ‌రిగిన భారీ అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు కానుందా…? చూస్తుంటె ప‌రిస్థితులు అలానె ఉన్నాయి. ప్రాజెక్టులో జ‌రిగి అవినీతిని బ‌ట్ట‌బ‌య‌లు చేసేందుకు జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారింది. దీంతో మాజీ సీఎం చంద్ర‌బాబులో వ‌ణుకు మ‌ద‌ల‌య్యింది.

అసెంబ్లీ స‌మావేశాల్లో పోల‌వ‌రం ప్రాజెక్టు ప్ర‌శ్నోత్త‌రంపై చ‌ర్చ వాడీ వేడీగా సాగింది. టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంధించిన ప్రశ్నల పట్ల మంత్రి అనిల్ కుమార్ వివరణ ఇవ్వగా అనంతరం.. ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఈ ప్రాజెక్టుపై మంత్రి వివ‌ర‌ణ ఇస్తున్నా టీడీపీ స‌భ్యులు మాత్రం గంద‌ర‌గోలం సృష్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు. పోలవరాన్ని స్కామ్‌లతో కూడిన ప్రాజెక్ట్‌గా బాబు మార్చార‌ని దుయ్య‌బ‌ట్టారు.

ప్రాజెక్టు అధ్య‌నంపై నిపుణుల‌క‌మిటీ ప‌నిచేస్తోంద‌ని …ప్రాజెక్టులో డ‌బ్బులు ఎన్ని ఆదాఅవుతాయో తెలుసుకొనేందుకే ఈ క‌మిటీ ప‌నిచేస్తోంద‌న్నారు. నవంబర్ 1 నుంచి పోలవరం పనులు ప్రారంభిస్తామన్న సీఎం.. జూన్ 2021 నాటికి పోలవరం నీళ్లు ఇస్తామన్నారు. చంద్రబాబు వల్లే ఇప్పుడు పోలవరం పనులు చేయలేకపోతున్నాం అని విమర్శించారు.

పోలవరం పనులను బిడ్డింగ్ లో ఎవరు తక్కువకు కోట్ చేస్తే వాళ్లకే పనులు అప్పగిస్తామనీ, దీనివల్ల మొత్తం వ్యయంలో 15-20 శాతం నిధులు మిగిలే అవకాశముందని వ్యాఖ్యానించారు. కేవలం రూ.6,500 కోట్ల విలువైన పనుల్లోనే 15-20 శాతం నిధులు మిగిలే అవకాశముందని జగన్ పేర్కొన్నారు.

టీడీపీ హయాంలో నామినేషన్ పద్ధతిలో సబ్ కాంట్రాక్టర్ల ముసుగులో ఇష్టారీతిన కాంట్రాక్ట్‌లను కట్టబెట్టారని సీఎం జగన్ ఆరోపించారు. నాటి ఆర్థిక మంత్రి యనమల వియ్యంకుడు కూడా పోలవరం సబ్ కాంట్రాక్టర్‌గా ఉన్నారన్న జగన్.. పెంచిన రేటుకు ఆయన పనులు చేస్తున్నారని వెల్ల‌డించారు.

ప్రాజెక్టు పనులు ప్రారంభించకుండానే గతంలో టీడీపీ ప్రభుత్వం గుత్తేదారులకు రూ.724 కోట్లు కట్టబెట్టిందని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టులో టీడీపీ నేతలు ఎంత దోచుకున్నారో మరో 15 రోజుల్లో అంతా బయటకొస్తుందని జగన్ హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -