Friday, April 26, 2024
- Advertisement -

రాష్ట్ర చరిత్రలో గతంలో ఎవ‌రూ తీసుకోని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న జ‌గ‌న్‌…

- Advertisement -

2014 ఎన్నిక‌ల్లో ఇంటికో ఉద్యోగ‌మ‌న్న మాజీ సీఎం చంద్ర‌బాబు ఐదేళ్ల పాల‌న‌లో ఎన్నిఉద్యోగాలు భ‌ర్తీ చేశారో అంద‌రికి తెలిసిందే. అయితే బాబు చేయ‌లేని ప‌నిని సీఎం జ‌గ‌న్ చేసి చూపిస్తున్నారు. ఐదేళ్ల పాల‌న‌లో బాబు నిరుద్యోగ‌ల‌ను న‌ట్టేట ముంచారు. కాని జ‌గ‌న్ 50 రోజుల పాల‌న‌లోనె ఇచ్చిన‌ హామీల‌ను అమ‌లు చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్న‌డూ ఎవ‌రూ తీసుకోని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 14,900 గ్రామ, వార్డు సచివాలయాలలో పని చేసేందుకు మొత్తం 1,33,867 కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫైలుపై జ‌గ‌న్ ఆమోద ముద్ర వేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 13,065 గ్రామ పంచాయతీలకు గాను ప్రభుత్వం 11,114 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనకు వచ్చింది. వీటిలో పని చేసేందుకు 99,144 మందిని కొత్తగా నియమించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాల ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. వార్డు సచివాలయాల్లో పని చేసేందుకు 34,723 మంది ఉద్యోగులను నియమిస్తారు

కొత్తగా 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కేవలం వారం పది రోజుల వ్యవధిలో శాఖల వారీగా నోటిఫికేషన్లు వెలువడుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నోటిఫికేషన్‌ సమయంలోనే ఏ ఉద్యోగానికి ఏ విద్యార్హత అన్న వివరాలను ఆ శాఖలు వెల్లడించనున్నాయి. దీన్ని బ‌ట్టి చూస్తె పాల‌న చేయ‌డానికి అనుభ‌వం కాదు చిత్త శుద్దిఉంటె చాల‌న్న‌ది జ‌గ‌న్ నిరూపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -