నటి రమప్రభ అల్లుడు తెలుగు హీరో అని మీకు తెలుసా ?

2554
Do You Know who is Ramaprabha's Son in law
Do You Know who is Ramaprabha's Son in law

రమప్రభ.. ఎన్నో సినిమాలో అద్భుతంగా నటించిన నటి. 90లలో ఎన్నో సినిమాలు చేసి.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. సీనియర్ స్టార్ కమెడియన్ రాజబాబుకి జోడీగా ఈమె 300లకు పైగా సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి ఎంతో మంది అగ్ర హీరోల సినిమాల్లో ఈమె నటించింది.

అదే సమయంలో ప్రముఖ నటుడు శరత్ బాబుని ప్రేమించి వివాహం చేసుకుంది రమప్రభ. 13 ఏళ్ళ పాటు వీరు కలిసి మెలిసి ఉన్నారు. కానీ ఆ తర్వాత వీరిద్దరు మధ్య మనస్పర్ధలు రావడంతో వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత ఈమె ఒంటరిగా ఉంటుంది. సినిమాల షూటింగ్స్ ఉంటే హైదరాబాద్ వస్తూ ఉంటుంది. లేకుంటే మదనపల్లిలోనే ఉంటుంది. ఇక ఇప్పటి హీరోలు రవితేజ ’నేనింత’.. అల్లు అర్జున్ ’దేశముదుర’ సినిమాల్లో కూడా ఈమె కీలక పాత్రలో కనిపించింది.

ఇదిలా ఉండగా.. ఈమె అల్లుడు ఎవరన్న విషయం చాలా మంది తెలిసి ఉండదు. ఈ విషయం తెలిస్తే ఎవరైన షాక్ కావాల్సిందే. ఆయన ఎవరో కాదు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారే..! విషయంలోకి వెళ్తే.. రమ ప్రభ తన అక్క కూతురు అయిన విజయ చాముండేశ్వరిని ఎప్పుడో దత్తత తీసుకుందట. ఈమెనే రాజేంద్ర ప్రసాద్ కు ఇచ్చి పెళ్లి చేసిందట.

ఈ విషయంను ఓ ఇంటర్వ్యూలో రమ ప్రభే చెప్పింది. అంతేకాదు.. ’మా అసోసియేషన్’ వల్ల ఈమె ఎన్నో అవమానాలను ఎదుర్కొందట. తన అల్లుడు రాజేంద్ర ప్రసాద్.. ‘మా అసోసియేషన్’ ప్రెసిడెంట్ గా ఉన్నప్పటికీ అవమానాలు ఫేస్ చెయ్యాల్సి వచ్చినట్టు కూడా చెప్పి కంటతడి పెట్టుకుంది సీనియర్ నటి రమప్రభ.

నాతో తిరిగిన వాళ్లే నన్ను తేడా అని అవమానించారు : జబర్దస్త్ పవన్

రానా, మిహీకా మెహిందీ ఫంక్షన్ సమంత వేసుకున్న డ్రెస్ ధర ఎంతంటే ?

రమ్యకృష్ణ కారణంగానే కృష్ణ వంశీ సక్సెస్ పోగొట్టుకున్నాడా ?

యాంకర్ ప్రదీప్ ఎందుకు పెళ్లి చేసుకోట్లేదో తెలుసా ?

Loading...