సీఎం హోదాలో జ‌గ‌న్, కేసీఆర్ భేటీ ఎప్పుడంటె..?

1393
Kcr and YS jaganmohan reddy will meet amaravathi in june
Kcr and YS jaganmohan reddy will meet amaravathi in june

ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత రాష్ట్ర రాజ‌కీయాలు కీల‌క మ‌లుపు తిర‌గ‌నున్నాయి. ఎన్నిక‌ల ఫ‌లితాలు వైసీపీకీ అనుకూలంగా వ‌స్తె సీఎంల హోదాలో కేసీఆర్‌, జ‌గ‌న్ భేటీ కానున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు ఉన్న‌విష‌యం అంద‌రికి తెలిసిందే. తెలంగాణ అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇద్దరూ రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కావాలని స్వరూపానంద రాజశ్యామల యాగం సైతం నిర్వహించారు. కేసీఆర్‌, జ‌గ‌న్ లు ఇద్ద‌రు ఏ ప‌ని మొద‌లు పెట్టాల‌న్నా స్వరూపానందేంద్ర‌స్వామి ఆశ్శీసులు ఉండాల్సిందే.

తన సన్నిహితులైన కేసీఆర్, జగన్ ముఖ్యమంత్రులు కావాలనేది స్వామీజీ ప్రగాఢ వాంఛ. ఇదిలా ఉంటే జూన్ నెలలో శారదా పీఠం ఉత్తరాధికారం మహోత్సవాన్ని అమరావతిలో పెద్ద ఎత్తున చేయాలని స్వరూపానంద స్వామీజీ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానె కేసీఆర్ ను స్వామీజీయే స్వయంగా హైదరాబాద్ వచ్చి ఆహ్వానించారు.

ఈనెల 23న ఫ‌లితాలు వెలువ‌డుతాయి. ఫ‌లితాలు వైసీపీకీ అనుకూలంగా వ‌స్తే జ‌గ‌న్ సీఎం పీఠంమీద కూర్చోనున్నారు. అన్న అనుకూలించి వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే స్వామిజీ తలపెట్టిన ఉత్తరాధికారి మహోత్సవంలో సీఎం కేసీఆర్‌తో పాటు కొత్తగా బాధ్యతలు చేపట్టే జగన్ సైతం హాజరయ్యే అవకాశం లేకపోలేదు. ఇదే జ‌రిగితె ఉత్స‌వాల‌ను మ‌రింత ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్బ్ంగా ఇద్ద‌రు సీఎల హోదాలో రాష్ట్రాల ప‌రిస్థితుల‌పై చ‌ర్చ‌లు జ‌రిపే అవ‌కాశాలు లేకపోలేదు. ఎన్ని అనుకున్నా 23 వ‌ర‌కు ఆగాల్సిందే.

Loading...