కోడెలను కొడుకే హత్య చేశాడు.. మేనల్లుడు ఆరోపణలు

333
Kodela causin kancheti sai sentational comments on kodwla death
Kodela causin kancheti sai sentational comments on kodwla death

మాజీ స్పీకర్ కోడెల అనుమానాస్పద స్థితిలో మరణంచడంపై అనేక రాకాల వార్తలు వినిపిస్తున్నాయి. వాటన్నింటిని పక్కన పెడితే ఇప్పుడు కోడెల ఆత్మహత్యకు రెండు గంటల ముందు ఏంజరిందనేది ఆసక్తికరంగా మారింది.ఉదయం 10 గంటల సమయంలో తన భార్యతో కలిసి టిఫిన్ చేశారు. 10.15 నిమిషాలకు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లారు.

తన గదిని లాక్ చేసుకున్నారు. కాసేపటి తర్వాత కోడెల డోర్ లాక్ చేసుకున్నట్లు ఆయన భార్య గుర్తించారు.తలుపులు తెరవాలంటూ డోన్ ను ఎంత కొట్టినా తెరవకపోవడంతో కోడెల సతీమణి.. గన్‌మెన్‌ను పిలిచారు. వెనుక డోర్ బద్దలు కొట్టి గన్‌మెన్ గది లోపలకి ప్రవేశించాడు. కోడెల అప్పటికే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఉన్నారు. 10 గంటల 40 నిమిషాలకు కోడెలను ఆయన భార్య, గన్‌మెన్ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి తరలించారు.

10 గంటల 50 నిమిషాలకు కోడెలను పరిశీలించిన బసవతారకం వైద్యులు ఆయన అప్పటికే మరణించినట్లు నిర్దారించారు.ఆయన మృతిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.తాజాగా అదే సమయంలో ఆయన మేనళ్లుడి కంచేటి సాయి సంచలన వ్యాఖ్యలు చేశారు.కోడెలను ఆయన కుమారుడు శివరాం హత్య చేశాడని కంచేటి సాయి ఆరోపించారు. ఈ మేరకు సత్తెనపల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ఆస్తి కోసం కోడెలను ఆయన కుమారుడు శివరాం హత్య చేశాడని వ్యాఖ్యానించారు. కోడెలను హత్య చేసిన ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని కంచేటి సాయి ఆరోపించారు. తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కోడెల తనకు ఫోన్ చేసేవారని కంచేటి సాయి అన్నారు.

ఇదే విషయమై తనను పలుసార్లు తన దగ్గరకు కోడెల పిలిపించుకున్నారని పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తండ్రిని ఇబ్బంది పెట్టవద్దని తాను కూడా పలుసార్లు శివరామ్‌కు సూచించానని అన్నారు. తనని కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించానని… అయితే అది కుదరలేదని వివరించారు. స్వయంగా ఆయన బావమర్దే సంచలన ఆరోపనలు చేయడం ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తోంది.

Loading...