Saturday, April 20, 2024
- Advertisement -

జగన్ ను విమర్శిస్తున్న బాబు అద్దె గొంతులకు షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేత..

- Advertisement -

కొద్ది రోజులుగా రాధాని వ్యవహరాంపై రాజకీయాలు వేడెక్కాయి. బొత్స చేసిన వ్యాఖ్యల ఫలితంగా రాజధానిని తరలిస్తున్నారంటూ టీడీపీ,భాజాపా, జనసేన పార్టీలు జగన్ పై తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. అంతేకాదు ఇటీవలె భాజాపాలో చేరిన టీడీపీ రాజ్యసభ సభ్యులు కూడా జగన్ ను టార్టెట్ చేశారు. సుజనా చౌదరి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. అయితే జగన్ కు భాజాపా సీనియర్ నాయకుడినుంచి అనూహ్య మద్దతు లభించింది.

ఏపీలో ఎదగ కుండా చేసింది చంద్రబాబు అని అందరికి తెలుసు. ఏపీ బీజేపీపై పసుపు పడగ నీడ కప్పేయడం వల్లనే కమలం ఇక్కడ వికసించలేకపోతోంది. గత నాలుగు దశాబ్దాలుగా బీజేపీ ఎదుగుదలకు ఒక పధకం ప్రకారం సైకిల్ అపాఅర్టీ అడ్డుకుంటూనే ఉంది. తాజా ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగాలంనుకుంది భాజాపా. దానికి కూడా బాబు అడ్డు కట్ట వేశారు.

అధికారంలో ఉన్న ప్పుడు చేసిన తప్పులనుంచి టీడీపీ తప్పించుకోవాలంటే ఏదో విధంగా భాజాపాతో సంబంధాలు కొనసాగించాలి. దానిలో భాగంగా నలుగురు టీడీపీ రాజ్యసభ్యులను భాజాపాలోకి పంపింది కూడా బాబేనన్న సంగతి తెలిసిందే.గతంలో బాబు చేసిన రాజధాని కుంభకోనంపై భాజాపా నేతలు పోరాటం చేశారు. మరో సారి అధికారంలోకి వస్తే బాబు చేసిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపిస్తామని ప్రకటించారు. కాని ఇప్పుడు కొందరు నేతలు దాని గురించి మాట్లాడకుండా జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. భాజాపాలో చేరిన టీడీపీ ఎంపీలు బాబుకు తెరవెనుక మాత్రం సపోర్ట్ చేస్తున్నారు.

ఇదే సమయంలో భాజాపా రెండు గ్రూపులుగా విడిపోయింది. మొదటి నుంచి పార్టీలో ఉంటూ చంద్రబాబు విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వర్గానికి ఎమ్మెల్సీ సోము వీర్రాజు నాయకత్వం వహిస్తున్నారు. అధ్యక్ష పదవి ఆశించిన సోమకు కన్నా షాక్ ఇస్తూ అధ్యక్ష పదవిని దక్కంచుకున్నారు.

ఇప్పుడు సుజనా చౌదరి హల్ చల్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో సోము వీర్రాజు ఈ రోజు మీడియాతో మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయన ఏకంగా బాబునే టార్గెట్ చేశారు. బాబుని మొదటి నుంచి స్టడీ చేస్తున్నానని, ఆయన కరెక్ట్ వ్యక్తి కాదని వీర్రాజు హాట్ కామెంట్స్ చేశారు. అంతే కాదు. రాజధాని గందరగోళానికి చంద్రబాబే ప్రధాన కారణమని కూడా ఆయన విమర్శించారు.ఏపీ రాజధాని పేరుతో చంద్రబాబు వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని, దాని మీద విచారణ జరిపించాలని కూడా అయన జగన్ సర్కార్ ని డిమాండ్ చేశారు.

పచ్చ గడ్డిని సైతం దోచుకున్న పచ్చ పార్టీ నేతలు ఉండాల్సింది జైలులో కానీ జనంలో కాదని కూడా సోము ఘాటుగానే విమర్శలు చేశారు. రాజధాని విషయంలో జగన్ని విమర్శిస్తున్న అద్దె గొంతుకల బీజేపీ నేతలకు చెంపపెట్టులా సోము వీర్రాజు వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. మరి భాజాపా నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -