Friday, April 26, 2024
- Advertisement -

మండ‌లిలో లోకేష్‌ను దుమ్ముదులిపిన మంత్రి అనిల్‌..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఉన్న‌త విద్యామండ‌లిలో నిధుల దుర్వినియోగంపై స‌భ‌లో చ‌ర్చ స‌మ‌యంలో వైసీపీ, టీడీపీ స‌భ్యుల మ‌ధ్య మాట‌లు తూటాల్లా పేలాయి. గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో ఉన్న‌త విద్యామండ‌ళిలో రూ.180 కోట్లు దారి మ‌ల్లించార‌ని విద్యాశాఖ మంత్రి సురేష్ ఆరోపించారు. ఈ విష‌యంపై జోక్యం చేసుకున్న లోకేష్ ఎదురుదాడికి దిగారు.

పేద ప్రజల కోసమే నిధులు మళ్లించామని.. వారి నాయకుడిలా సొంత కంపెనీలకు వాడుకోలేదంటూ ఎదురుదాడి చేశారు. తమపై 11 ఛార్స్‌షీట్లు లేవు.. 16 నెలలు జైలుకు వెళ్లలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్ చేసిన వ్యాఖ్య‌ల‌కు మంత్రి అనిల్ కుమార్ గాటుగా కౌంట‌ర్ ఇచ్చారు.

మంగ‌ళ‌గిరిని మంద‌ల‌గిరి అని….జ‌యంతికి…వ‌ర్థంతికి కూడా లోకేష్‌కు తేడా తెలియ‌దంటూ సెటైర్లు వేశారు. మాతృభాష కూడా మాట్లాడ‌లేని నువ్వా జ‌గ‌న్‌ను విమ‌ర్శించేద‌ని ఘాటుగా బ‌దులిచ్చారు. లోకేష్ లోకేష్‌కు తెలుగు భాషలో ట్రైనింగ్ ఇప్పించాల్సిన అవసరం ఉందని అనిల్ అన్నారు. అర్ధరాత్రి కాంగ్రెస్‌తో కుమ్మక్కై చిదంబరం కాళ్లు పట్టుకుని వైఎస్ జగన్‌పై తప్పుడు కేసులు పెట్టించారన్నారు.

దీనిపై మ‌రో సారి మండ‌లిలో తీవ్ర గంద‌ర‌గోలం నెల‌కొంది. మంత్రి అనిల్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలన్నారు. వాళ్ల ముఖ్యమంత్రిలా తనపై కేసులు లేవని.. వారం, వారం కోర్టుకు వెళ్లడం లేదన్నారు. లోకేష్ వ్యాఖ్యలతో సభలో గందరగోళం ఏర్పడింది. మ‌రో సారి లోకేష్ జగన్ కేసులు ప్రస్తావన తీసుకురావడంతో సభలో గందరగోళం ఏర్పడింది. లోకేష్ క్షమాపణలు చెప్పాలని మంత్రి బొత్స డిమాండ్ చేశారు. దీంతో మండళిని రేప‌టికి వాయిదా వేశారు ఛైర్మెన్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -