Saturday, April 27, 2024
- Advertisement -

కోర్టు తీర్పుపై స్పందించిన సూరి భార్య భానుమ‌తి

- Advertisement -

మ‌ద్దెల చెరువు సూరి హ‌త్య కేసులో 7 సంవ‌త్స‌రాల త‌రువాత తీర్పును ప్ర‌క‌టించింది నాంప‌ల్లి కోర్టు. ప్ర‌ధాన నిందితుడైన భాను కిర‌ణ్‌కు యావ‌జ్జీవ శిక్ష విధించింది నాంప‌ల్లి కోర్టు.భాను కిర‌ణ్‌కు యావ‌జ్జీవ శిక్ష‌తో పాటు,
20 వేల రూపాయిలు జ‌రిమానా విధించింది.2011లో మ‌ద్దెల చెరువు సూరిని కారులో ప్ర‌యాణిస్తుండ‌గానే పాయింట్ బ్లాక్‌లో కాల్చి చంపాడు భాను కిర‌ణ్‌.త‌న పేరు చెప్పి వేల కోట్ల ఆస్తులు సంపాదించాడ‌ని తెలుసుకున్న మ‌ద్దెల చెరువు సూరి ,ఆ ఆస్తుల‌ను త‌న పేరు మీ బ‌దిలీ చేయాల‌ని భాను కిర‌ణ్ మీద ఒత్తిడి చేయ‌డంతోనే సూరి హ‌త్య జ‌రిగింద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.

ఈ హ‌త్య‌లో కీల‌క నిందితుడిగా నేరం రుజువు కావడంతో భానుకిర‌ణ్‌కు శిక్ష విధించారు. ఈ హ‌త్య కేసులో కారు డ్రైవ‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్‌కు కూడా శిక్ష విధించింది కోర్టు.అత‌నికి 5 సంవ‌త్స‌రాల జైలు శిక్షతో పాటు , 5 వేల రూపాయిలు జ‌రిమానా విధించింది.కోర్టు తీర్పుపై ఆనందం వ్య‌క్తం చేసిన మ‌ద్దెల చెరువు సూరి భార్య భానుమ‌తి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -