బాబు స‌మీక్ష‌కు కాపు నేత‌లు డుమ్మా….ఆందోళ‌న‌లో అధినేత‌..

403
TDP Copu Leaders did not attend to chandrababu party meeting
TDP Copu Leaders did not attend to chandrababu party meeting

చంద్రబాబునాయుడుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం షాకులిస్తుంటే మరోవైపు సొంతపార్టీ నేత‌ల ఝ‌ల‌క్ ఇస్తున్నారు. ఒక వైపు అక్ర‌మ కట్ట‌డాల కూల్చివేత‌….మ‌రో వైపు పార్టీ ఫిరాయింపులు, తాజా రాజకీయ పరిణామాలపై బాబు త‌న నివాసంలో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. యూర‌ప్ ట్రిప్ నుంచి వ‌చ్చిన బాబు ఈ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. అయితే ఈ స‌మావేశానికి కాపు నేత‌లు హ‌జ‌రు కాకుండా షాక్ ఇచ్చారు. దీంతో పార్టీలో ఏం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి.

బాబు యూర‌ప్ టూర్‌లో ఉన్న‌ప్పుడు పార్టీకి చెందిన న‌లుగురు ఎంపీలు భాజాపా కండువా క‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. ఎమ్మెల్యేలు కూడా భాజాపాలోకి వెల్లేందుకు సిద్దంగా ఉన్నార‌న్న వార్త‌ల‌తో బాబు క‌ల‌వ‌ర ప‌డుతున్నారు. అదే స‌మ‌యంలో కాకినాడలో టిడిపిలోని కాపు నేతలు రహస్య సమావేశం పెట్టుకున్న విషయం సంచలనం కలిగించింది. కాపు నేతలు అందులోను మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వారు ప్రత్యేకంగా కలవటంతో పార్టీలో కలకలం రేగింది.

ఈ నేపధ్యంలోనే చంద్రబాబు అధ్యక్షతన బుధవారం కాపు నేతల సమావేశం జరిగింది. అయితే ఆ సమావేశానికి ఒక్క కాపు నేత కూడా హాజరుకాకపోవటంతో చంద్రబాబు షాక్ తిన్నారు.విజయవాడలో ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సమావేశానికి హాజరుకాకపోగా… మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రు, పంచకర్ల రమేష్ బాబు, తోటా త్రిమూర్తులు కూడా ఈ భేటీకి డుమ్మా కొట్టారు. వారంతా ఉద్దేశ్యపూర్వకంగానే ఈ నేతలు సమావేశానికి హాజరుకాలేదని ప్రచారం సాగుతోంది. దీంతో ఏపీ రాజకీయాల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయో అనే చర్చ ఒక వైపు సాగుతుండ‌గా మ‌రో వైపు…మాజీ మంత్రి, కాపు నేత తోట త్రిమూర్తులు ప్రజావేదిక ముమ్మాటికి అక్రమ నిర్మాణమే అంటూ చేసిన ప్రకటన సంచలనంగా మారింది.

Loading...