Friday, April 26, 2024
- Advertisement -

పార్టీ మార‌డంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన టీడీపీ మాజీ ఎంపీ రాయ‌పాటి…

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డేందుకు భాజాపా ఆప‌రేష‌న్ ఆక‌ర్శ్‌కు తెర‌లేపింది. దానిలో విజ‌యం సాధించింది. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నేత‌ల‌కు గాలం వేస్తోంది. ఇప్ప‌టికే కీల‌క నేత‌లు కాషాయ కండువా క‌ప్పుకున్నారు. తాజాగా మాజీ ఎంపీ రాయ‌పాటి సాంబిశివ‌రావు కూడా క‌మ‌లం గూటికి చేరేందుకు సిద్ద‌మ‌య్యారు. భాజాపా నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన రాయ‌పాటి త్వ‌ర‌లో ఢిల్లీ వెల్లి భాజాపాలో చేర‌నున్నారు.

భాజాపాలో చేర‌డంపై రాయ‌పాటి స్పందించారు. తాను బీజేపీలో చేరికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించారు. ఆ పార్టీలో చేరాలని బీజేపీ నేతలు తనను ఆహ్వానించిన విషయం నిజమేనని అన్నారు. రామ్ మాధ‌వ్ ఇంటిచి వ‌చ్చి చ‌ర్చ‌లు జ‌రిపార‌ని తెలిపారు. ఇదే విష‌యాన్ని చంద్ర‌బాబు దృష్టికి కూడా తీసుకెల్లాన‌న్నారు. వచ్చే వారం ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత ఆ పార్టీలో చేరాలో లేదో నిర్ణయం తీసుకుంటానని రాయపాటి తెలిపారు.

ఇద‌లా ఉంటె ఆయ‌న కొడుకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయపాటి రంగారావు మాత్రం టీడీపీనీ వీడేది లేదంటున్నారు.2 014 ఎన్నికల్లో టీడీపీ త‌రుపున నరసరావుపేట నుంచి ఎంపీగా గెలిచారు. ఇటీవ‌లె జ‌రిగ‌ని ఎన్నిక‌ల్లో ఓడిపోయారు.బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించడంతో.. ఆయన చూపు ఆ పార్టీవైపు మళ్లింది. మ‌రో వైపు టీడీపీ అధికారంలోకి రాక‌పోవ‌డంతో ఆయ‌న‌కు ఇబ్బందులు ఉన్నందునె భాజాపాలోకి వెల్తున్నార‌నె వాద‌న వినిపిస్తోంది. ర‌మ్మ‌న్న‌ప్పుడు ఈ నాడ్చుడు దోర‌ణి ఎందుకో అర్థం కావ‌ట్లేదు. లేక పోతె భాజాపాతో బేరం కుద‌ర‌లేదా అన్నా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -