హలో హీరోయిన్ కళ్యాణి లవర్ ఎవరో తెలుసా ?

360
The directors daughter is married to this hero
The directors daughter is married to this hero

’హలో’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కళ్యాణ్ ప్రియదర్శన్. ఈ సినిమా అనుకున్నంత పెద్ద హిట్ కాలేకపోయినప్పటికి వరస అవకశాలు దక్కించుకుంది. కళ్యాణ్ దర్శకుడు ప్రియదర్శన్ కూతురు. ఇక ఇటీవలే చిత్రలహరి సినిమాతో డీసెంట్ హిట్ అందుకుంది కళ్యాణి. అయితే హలో మూవీలో హీరో,హీరోయిన్లు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ తర్వాత విడిపోయి పెద్దయ్యాక మళ్లీ కలుసుకుంటారు.

ఇప్పుడు ఈ కథే కళ్యాణి జీవితంలో జరుగుతున్నట్లు అనిపిస్తోంది. దర్శకుడు ప్రియదర్శన్, హీరో మోహన్ లాల్ కుటుంబాల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. వీరిద్దరి కాంబోలో దాదాపుగా 43 సినిమాలు వచ్చాయి. దాంతో ప్రియదర్శన్ కూతురు కళ్యాణి, మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. అది ఇప్పుడు లవ్ గా మారినట్లుగా తెలుస్తోంది.

అంతేకాకుండా ఒక సందర్భంలో కళ్యాణి తాను ఒకర్ని ప్రేమిస్తున్నానని అతనినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అంతేకాకుండా తన లవ్ గురించి తమ ఇంట్లో కూడా తెలుసని వాళ్ళు కూడా ఓకే చేశారని చెప్పింది. కానీ అతని పేరు మాత్రం బయటకు చెప్పలేదు. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన టాక్ ప్రకారం ఆమె ప్రేమిస్తుంది ప్రణవ్ నే అని అందరూ అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం వీరిద్దరు ఎవరి సినిమాలతో వాళ్లు బిజీ బిజీగా ఉన్నారు.

Loading...