Saturday, April 27, 2024
- Advertisement -

చిన్మాయి కామెంట్స్.. షాక్ ఇచ్చిన పురుష సంఘం..!

- Advertisement -

ఇటీవలే తమిళనాడు లో ఓ మూవీ ఫంక్షన్ లో మ‌హిళ‌ల‌ను ఉద్దేశించి సంచల వ్యాఖ్యలు చేశారు న‌టుడు, ద‌ర్శ‌క‌, నిర్మాత భాగ్యరాజ్. మహిళలు ధరించే వస్త్రాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటే ఎలాంటి తప్పు జరగవని.. తప్పులు జరగడానికి కారణం మహిళలే అని ఆయన అన్నారు. దీనిపై గాయని చిన్మాయి సహా తమిళనాడు మహిళా సంఘాలు భగ్గుమన్నాయి.

మహిళల గురించి చులకనగా మాట్లాడుతావా ? ఆడవాళ్లకు నీతులు చెబుతావా ? అంటూ నిరసనలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా భాగ్యరాజ్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని మహిళా సంఘాలు భాగ్యరాజకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఈ క్రమంలో భాగ్యరాజ్ ఒక్కడిగానే న్యాయ పోరాటం చేస్తున్నారు. దాంతో ఆయనకు మద్దతుగా తమిళనాడు పురుషుల సంఘం బరిలోకి దిగింది.

పురుషులంతా క‌లిసి త‌మ హ‌క్కుల కోసం పోరాటం చేస్తామ‌ని వెల్ల‌డించింది. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండమని చెప్పడం తప్పా ? అని మహిళా సంఘాల తీరుపై పురుష సంఘం మండిపడింది. హక్కులు అంటూ ముందుకొచ్చే ముందు హద్దులనేవి కొన్ని ఉంటాయి వాటిని మర్చిపోతే ఎలా ? అని ప్రశ్నించాయి. భాగ్యరాజ్ చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం తప్పు లేదని న్యాయ పోరాటానికి మేము సిద్దంగా ఉన్నామ‌ని భాగ్య‌రాజ్ కు పురుషుల సంఘం భ‌రోసా ఇచ్చారు. అయితే మహిళల పట్ల పోరాడే చిన్మాయికి పురుషుల సంఘం షాక్ ఇచ్చినట్లు అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -