కాజల్ పెళ్లి చేసుకోబోతుందా ? అబ్బాయి ఎవరు ?

686
actress kajal aggarwal marriage fixed
actress kajal aggarwal marriage fixed

టాలీవుడ్ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. దాదాపుగా 13 ఏళ్ళ నుండీ కాజల్ ఇండస్ట్రీలో రాణిస్తోంది. కొత్త ముద్దుగుమ్మలు ఎంత మంది వచ్చిన కాజల్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజివి సరసన ’ఆచార్య’ మూవీలో నటిస్తోంది. అలానే విష్ణు మంచుతో ‘మోసగాళ్లు’ అనే చిత్రంలో కూడా నటిస్తుంది.

తమిళంలో శంకర్ డైరెక్ట్ చేస్తున్న ‘ఇండియన్2’ అలాగే వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించబోతుంది కాజల్. ఇక హిందీలో కూడా ‘ముంబై సాగా’ అనే చిత్రంలో నటిస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్యనే తన 35వ పుట్టినరోజుని జరుపుకున్న కాజల్.. త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఔరంగాబాద్‌ కు చెందిన ఓ బిజినెస్ మెన్ ను.. కాజల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వీరిద్దరి పెళ్లికి.. వీరి కుటుంబసభ్యులు కూడా అంగీకరించారని తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. కాజల్ చెల్లి నిషా అగర్వాల్ కు పెళ్లి ఎప్పుడో అయింది. ఆమెకు ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే కాజల్ మాత్రం తన సినిమాల పైనే ఫోకస్ పెట్టడం వల్ల లేటయ్యిందని చెప్పొచ్చు. అయితే కాజల్ పెళ్లి పై వార్తలు రావడం ఇప్పుడేం కొత్త కాదు. గతంలో కూడా ఈమె పెళ్లిపై వార్తలు వచ్చాయి. అప్పుడు వాటిని కాజల్ ఖండించింది. మరి ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

సమంతతో క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్ కి కరోనా పాజిటివ్.. షాక్ లో ఫ్యాన్స్..!

కొత్త బాధ్యతలు చేపట్టనున్న ఎన్టీఆర్ భార్య..!

నిహారిక పెళ్లి కుదరడానికి వెనుక పవన్ పాత్ర..!

దర్శకుడి కొడుకుతోనే అనుష్క పెళ్లి.. నిజమే..?

Loading...