హీరోయిన్ మెహ్రీన్ ను ఇబ్బంది పెట్టిన నాగశౌర్య తండ్రి

2877
actress mehreen pirzada reportedly upset with naga shauryas father
actress mehreen pirzada reportedly upset with naga shauryas father

హీరో నాగశౌర్య తండ్రి చేసిన పనికి హీరోయిన్ మెహ్రీన్ చాలా బాధపడుత్తోంది. ఇంతకి ఏం అయిందంటే.. నాగశౌర్య, మెహ్రీన్ జంటగా నటించిన చిత్రం ’అశ్వథ్థామ’. ఈ సినిమా ప్రమోషన్స్ లో దాదాపుగా మెహ్రీన్ పాల్గొన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేయాలనుకున్నారు.

ఇందుకోసం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును గెస్ట్ గా అహ్వానించారు. ఈ వేడుకకు తప్పకుండా రావాలని మెహ్రీన్‌కు హీరో నాగశౌర్య తండ్రి శంకర్‌ ప్రసాద్‌ చెప్పారట. కానీ అప్పటికే అలెర్జీతో మెహ్రీన్ బాధపడుతుంది. అందుకే రాలేనని చెప్పిందట. అందుకు ఫ్రూప్స్ గా డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ కూడా పంపిందట. అయితే శౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ ఒప్పుకోలేదట. వేడుకకు రాఘవేంద్రరావు వస్తున్నప్పుడు హీరోయిన్ లేకపోతే బాగోదని, కచ్చితంగా వచ్చి తీరాల్సిందేనని గట్టిగా చెప్పారట.

ఒకవేళ ఈవెంట్‌కు రాకపోతే మెహ్రీన్‌కు సంబంధించిన హోటల్ బిల్స్ కట్టనని బెదిరించారట. ఆయన ప్రవర్తన నచ్చక మెహ్రీన్ చెప్పకుండా హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత హోటల్ యాజమాన్యం శంకర్ ప్రసాద్‌కు ఫోన్ చేసి మెహ్రీన్ వెళ్లిపోయిన సంగతి చెప్పారు. ఆమె ఉన్నని రోజుల బిల్లు కట్టాలని అన్నారట. ఇక చేసేదేం లేక బిల్లులు అన్ని కట్టారట. హెల్త్ బాలేనప్పుడు కుడా ఆర్టిస్ట్ ను ఇలా బెదిరించి మరీ ఈవెంట్ కు రావాలని చెప్పడం మెహ్రీన్ కు నచ్చలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Loading...