సైరాలో అల్లు అర్జున్‌.?

1872
Allu arjun key role play to Sye Raa Narasimha Reddy movie
Allu arjun key role play to Sye Raa Narasimha Reddy movie

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా న‌టిస్తున్న సినిమా సైరా.స్వాతంత్రద్యోమకారుడు ఊయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కిస్తున్నారు.సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు.సినిమా షూటింగ్ చాలా వ‌ర‌కు పూర్తి కావచ్చింది.తాజాగా ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ ఓ కీలక పాత్ర‌లో క‌నిపించ‌నునున్నాడ‌ని స‌మాచారం.గతంలో అల్లు అర్జున్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శకత్వంలో రేసుగుర్రం సినిమా చేశాడు.

దీంతో ఓ పాత్ర‌కు బ‌న్ని అయితే సరిగ్గా స‌రిపోతాడ‌ని భావించిన సురేంద‌ర్ రెడ్డి వెంట‌నే రామ్ చ‌ర‌ణ్‌తో చ‌ర్చించి బన్నిని ఓకే చేసిన‌ట్లు తెలుస్తుంది.అయితే బ‌న్ని సైరా సినిమాలో న‌టించ‌డంపై చిత్ర యూనిట్ ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.ఇక ఈ సినిమాలో చిరుకి జోడీగా కనిపిస్తుండగా అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు.