బండ్ల గణేష్ తో పవన్ కళ్యాణ్ నిజమేనా…

- Advertisement -

రాజకీయాలకు కొంత గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఒకేసారి మూడు సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. అందులో మొదటిగా వస్తున్నది దిల్ రాజు నిర్మాత గా రాబోతున్న వకీల్ సాబ్ అనే సినిమా.. వేణు శ్రీరామ్ ఈ సినిమా కి దర్శకుడు.. గతంలో ఓ మై ఫ్రెండ్ సినిమా తో దర్శకుడిగా పరిచయమైనా వేణు ఆతర్వాత రవితేజ తో ఓ సినిమా ప్లాన్ చేసినా అది వర్క్ అవుట్ కాలేదు.. దాంతో కొంత టైం తీసుకుని బాలీవుడ్ లోని పింక్ సినిమా తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. అయితే ఈ కథను పవన్ కళ్యాణ్ చేయడం విశేషం.. బాలీవుడ్ లో పింక్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. అమితాబ్ నటించిన ఈ సినిమా ఇప్పటికే పలుభాషల్లో రిలీజ్ కాగ తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు..

తెలుగు నేటివిటి కి తగ్గట్లు, పవన్ కళ్యాణ్ హీరోయిజానికి తగ్గ మార్పులు చేసి ఈ సినిమా ని ఇక్కడ చేస్తున్నారు.. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది.. ఇటీవలే సినిమా కు సంబంధించి ఓ పాట, మోషన్ పోస్టర్ రిలీజ్ కాగ, పవన్ ఫాన్స్ వాటిని ఎంతగా ఆదరించారో అందరికి తెలిసిందే.. కరోనా వల్ల సినిమా దియేటర్స్ ఇంకా ఓపెన్ కాకపోవడంతో నిర్మాతలు ఎంతకొస్తే అంతకు OTT  లకు అమ్మేస్తున్నారు.. ఈ సినిమాను కూడా దిల్ రాజు అమ్మే ఆలోచనలో ఉన్నా పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు ఒప్పుకోవట్లేదు..

- Advertisement -

ఇక ఈ సినిమా తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఇక ఈ సినిమా తర్వాత కూడా పవన్ ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.. దానికి నిర్మాత బండ్ల గణేష్ అని తెలుస్తుంది. . ఈ ఇద్దరి కాంబోలో గతంలో తీన్మార్, గబ్బర్ సింగ్ వచ్చాయి. మొదటిది డిజాస్టర్ కాగా రెండోది ఇండస్ట్రీ హిట్టు కొట్టి ఏకంగా బండ్ల గణేష్ ని స్టార్ ప్రొడ్యూసర్ ని చేసింది. కానీ ఆ తర్వాత దాన్ని దాటే సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. వరస ఫ్లాపులతో కాస్త వెనక్కు తగ్గి ఎక్కువ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పవన్ సరే అన్నాడు అంటే అంతకన్నా పండగ ఏముంటుంది. కాకపోతే ఒక్కో ప్రాజెక్ట్ షూటింగ్ కు ఎంత సమయం అవసరం అవుతుందన్నది పెద్ద చిక్కే.

Most Popular

Related Articles

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు..!

జాని జాని సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యణ్, రేణు దేసాయి నటించిన ఈ చిత్రం అట్టర్ ప్లాప్ గా...

క్రిష్ సినిమా చేయలంటే కండిషన్ పెట్టిన పవన్..

పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. పిరియాడికల్ సినిమా గా తెరకెక్కబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండగా పవన్...

పవన్ కళ్యాణ్ మ్యానరిజం ని పొలిటికల్ ఫాన్స్ మిస్ అవుతున్నారట

సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని సినిమా ల నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ కి...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...