Friday, April 26, 2024
- Advertisement -

బిగ్ బాస్ వల్ల ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..?

- Advertisement -

బిగ్ బాస్ షో.. 70 రోజులుగా ప్రేక్షకులను ఆలరించింది. అయితే ఈ షోలో పాల్గొన్నా.. సెలబ్రిటిల వ్యక్తిగత శైలి ఎలా ఉంటుందన్న విషయం తెలిసింది. అయితే వారు నిజంగా అలానే ఇంట్లో కూడా ఉంటారా.. లేకుంటే.. స్క్రిప్టా ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో నడుచుకున్నారా అన్నది పక్కన పెడితే.. సగటు ప్రేక్షకులు మాత్రం వారి గురించి ఒక అభిప్రాయానికి వచ్చేశారు.

బిగ్ బాస్ హౌస్ లో జరిగిన పరిణామాలు.. అక్కడ నుంచి వచ్చాకా జరిగిన పరిణామాలు కొందరికి మేలు చేస్తే.. మరి కొందరికి మైనస్ గా మారాయి. ప్రధానంగా కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు.. ఈ ప్రోగ్రాంతో బాగా అభాసుపాలయ్యాడు. తన మీద ఉన్న మంచి క్రేజ్ ను పోగొట్టుకున్నాడు. అలానే గాయని మధుప్రియ పాట గురించి అందరికి తెలుసు.. ఇప్పుడు ఆమె ఏడుపు ఎలా ఉంటుందో తెలిసింది. సెక్సీ స్టార్ ఇమేజ్ ఉన్న ముమైత్ ఐటమ్ సాంగ్స్ ను అందరు ఇష్టపడుతారు. కానీ ఆమె బిగ్ బాస్ లో మగరాయుడిలా చేసి.. అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. మరో గాయని కల్పన ఇమేజిపైనా ప్రభావం కనిపిస్తోంది. అదే సమయంలో పెద్దగా అవకాశాలేమీ లేని ప్రిన్స్, ఆదర్శ్ వంటివారికి మాత్రం ఇది బాగా కలిసొచ్చింది.

అలాగే హరితేజ, అర్చనలకు ప్లస్ అయింది. మొదట్లోనే బయటకు వచ్చేసిన జ్యోతికి ఈ షోతో కొత్తగా వచ్చిందీ లేదు, పోయిందీ లేదు. కత్తి కార్తీక తాజాగా పాపులర్ అయిన బతుకమ్మ వీడియో సాంగ్స్ లో హైలైట్ కావడం వెనుక బిగ్ బాస్ ఇంపాక్ట్ ఉందనుకోవాలి. ఇక విజేత శివ బాలజీ వద్దకు ఆర్య, చందమామ వంటి సినిమాల్లో ఆయన నటించినా ఆర్య బన్నీ ఖాతాల్లో, చందమామా నవదీప్ ఖాతా పడిపోయింది. మరి బిగ్ బాస్ తో అన్న.. శివ బాలాజీకి కలిసివస్తుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -