Friday, April 26, 2024
- Advertisement -

హరీష్ శంకర్ పవన్ తో మిరపకాయ 2 చేస్తున్నారా…?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉంచిన సంగతి తెలిసిందే.. అందులో ఒకటి హరీష్ శంకర్ దర్శకత్వం రాబోతున్న సినిమా.. గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ కావడంతో వీరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఫై మంచి అంచనాలు నెలకొన్నాయి.. అయితే ఇప్పుడు పవన్ చేస్తున్న సినిమాల పై ఎంతో కొంత అవగాహనా అయితే ఉంది.. ఆ సినిమాల బ్యాక్ డ్రాప్ లు , వేషాలు , టైటిల్ వంటి వాటితో వారి స్టోరీ ని ఎంతో కొంత గెస్ చేయొచ్చు కానీ ఒకే ఒక పోస్టర్ ని రిలీజ్ చేసిన హరీష్ శంకర్ సినిమా ని మాత్రం ఎలా ఉంటుందనేది ఎవరు గెస్ చేయలేకపోతున్నారు..

పవర్ స్టార్ పవన్ వకీల్ సాబ్ లో లాయర్ గా నటిస్తున్నాడు.. బాలీవుడ్ లో పింక్ సినిమా కి రీమేక్ గా వస్తుంది కనుక అత్యాచారాల వెనుక సాగే కథ అని అందరికి తెలిసిందే.. అయితే తెలుగు నేటివిటీ కి తగ్గట్లు ఈ సినిమా ని ఎలా చిత్రీకరించారన్నది చూడాలి.. థమన్ సంగీతం ఈ సినిమా కి హైలైట్ అంటున్నారు.. ఇప్పటికే ఓ సాంగ్ సోషల్ మీడియా ని దుమ్ము దులిపేస్తుంది.. ఈ సినిమా తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని అందరికి తెలిసిందే..

సోసియో ఫాంటసీ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపిస్తున్నదని తెలుస్తుంది.. ఇలా ఈ రెండు సినిమాల గురించి ఎంతో కొంత అయితే జనాలకు తెలుసు.. కానీ హరీష్ శంకర్ చేయబోయే సినిమా గురించి మాత్రం ఎవరికీ ఏమీ తెలియదు..  కాన్సెప్ట్ పోస్టర్ అంటూ పవన్ బర్త్ డేకి విడుదల చేసిన పోస్టర్ గురించి కూడా పవన్ స్పందించలేదు. ఆ పోస్టర్ ద్వారా ఇది కమర్షియల్ సినిమానే కానీ సోషల్ మెసేజ్ ఉంటుందని హరీష్ తెలియజేసాడు. అంతకు మించి ఆ సినిమా గురించి ఇప్పుడే మాట్లాడడం కరెక్ట్ కాదని వెయిట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో పవన్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడని, గబ్బర్ సింగ్ మాదిరిగానే పవన్ ని పోలీస్ పాత్రలో విలక్షణంగా చూపించడానికి హరీష్ ప్లాన్ చేస్తున్నాడని కొందరు అంటున్నారు.. ఈ నేపథ్యంలో హరీష్ ఈ సస్పెన్సు సినిమా కి ఏవిధంగా ఉపయోగపడుతుందో చూడాలి..

బండ్ల గణేష్ తో పవన్ కళ్యాణ్ నిజమేనా…

స్పీడ్ పెంచిన పవన్ కళ్యాణ్…

పవన్ కళ్యాణ్ అభిమానులపై ఫైర్ అయిన అనసూయ..!

పవన్ కళ్యాణ్‌ మూవీలో పునర్నవికి ఛాన్స్.. ఏ పాత్ర అంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -