నాతో తిరిగిన వాళ్లే నన్ను తేడా అని అవమానించారు : జబర్దస్త్ పవన్

1286
jabardasth Pawan Says I Faced Lot Of Insults In My Hometown
jabardasth Pawan Says I Faced Lot Of Insults In My Hometown

జబర్దస్త్‌లో లేడీ గెటప్‌లు వేసి మంచి క్రేజ్ తెచ్చుకున్న వారిలో పావని అలియాస్ పవన్ రాథోడ్ కూడా ఒకరు. అయితే లేడీ గెటప్ లు వేయడం వల్ల చాలా మంది హేళన చేశారని తెలియజేశాడు పవన్. “మా ఫ్యామిలీ చాలా పెద్దది. నలుగురం అన్నదమ్ములం, ముగ్గురు అక్కలు. అమ్మనాన్న పోలం పనులు చేసుకుంటారు.

నేను లేడీ గెటప్‌లు వేయడంతో ఏనాడూ కూడా మా ఫ్యామిలీ నుంచి ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అడగలేదు కాని.. మా పెద్దక్క వాళ్ల పిల్లలు నా గురించి జనం రకరకాలు మాట్లాడుకుంటున్నారని అక్కతో చెప్పారట. అప్పుడు అక్క బాధపడి.. సోసైటీలో జనం తప్పుగా అనుకుంటున్నారని చెప్పింది. అప్పుడు మా అమ్మ.. ఎవరో ఏదో అనుకుంటారని.. వాడి లైఫ్ పాడు చేసుకుంటాడా.. వాడు ఏంటో మనకు తెలుసు. బయటవాళ్ల గురించి మనకెందుకు అని నాకు ధైర్యం చెప్పింది.

మా తాండాలో జనాలు అయితే నన్ను ఘోరంగా అవమానించారు. వాళ్ల అన్న మాటలకు చాలా బాధ పడ్డాను. నాతో తిరిగిన వాళ్లే.. నన్ను తేడాగాడు అని బాధపెట్టారు. లేడీ గెటప్ వేస్తున్నాను అంటే.. దేనీకి పనికి రావు అని తిట్టారు. అయితే మా బాబాయ్ వాళ్ల కూతురు సుశీల.. పవన్ ఊర్లోవాళ్లు అలాగే మాట్లాడతారు. నువ్వు అవేం పట్టించుకోకు. నీ టార్గెట్ ఏంటో నీకు తెలుసు కాబట్టి నువ్ నీ గోల్ రీచ్ కావడానికే ఆలోచించు అని ధైర్యం చెప్పింది. ఆ తర్వాత ఊరుకి వెళ్ళలేదు. మా ఊరి వాళ్ల మీద కోపంతో నేను వాళ్ల ముందుకు వెళ్లడం మానేయలేదు. నేను ఏదోటి సాధించిన తరువాతే వెళ్లాలని అనుకున్నాను.

ఆరోజుల్లో నేను మా ఊరి వాళ్ల మాటలకు ఏడ్చాను.. బాధపడ్డాను.. వీళ్ల ముందు తల ఎత్తుకుని ఎలా తిరగాలి అని కుమిలిపోయా.. కాని ఇప్పుడు ఏ ఊరు వాళ్లు అయితే నన్ను అవమానించారో వాళ్లే నన్ను ఒక్కసారి మన ఊరికి రా.. ఊర్లో వినాయక చవితి, బతుకమ్మ పండగ చేస్తున్నాం.. నువ్వు తప్పకుండా రావాలని పిలుస్తున్నారు. షూటింగ్‌లు ఉండటం వల్ల వెళ్లలేకపోతున్నా కాని.. వాళ్లు పిలవడం నాకు చాలా ఆనందంగా గర్వంగా అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు జబర్దస్త్ పవన్.

రానా, మిహీకా మెహిందీ ఫంక్షన్ సమంత వేసుకున్న డ్రెస్ ధర ఎంతంటే ?

రమ్యకృష్ణ కారణంగానే కృష్ణ వంశీ సక్సెస్ పోగొట్టుకున్నాడా ?

యాంకర్ ప్రదీప్ ఎందుకు పెళ్లి చేసుకోట్లేదో తెలుసా ?

షాకింగ్ : ప్రభాస్ పారితోషికం 100 కోట్లు.. డార్లింగ్ రేంజ్ ఇది..!

Loading...