Saturday, April 27, 2024
- Advertisement -

నా దేవుడు పవన్ కళ్యాణ్!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఏ రెంజ్ లో ఫ్యాన్స్‌ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఫ్యాన్స్‌ తో పాటు టాలీవుడ్ సినీ పరిశ్రమలో కూడా పవన్‌ అభిమానించి వ్యక్తులు చాలా మందే ఉన్నారు. అయితే జబర్దస్త్ అనే షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అర్టిస్ట్ శకలక శంకర్.

జబర్దస్త్ తో ఫేమస్ అయిన శకలక శంకర్ తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ అని చాలా సార్లు చెప్పాడు. పవన్ కళ్యాణ్ నా దేవుడని మరోసారి స్పష్టం చేసాడు. ఇప్పుడు చెప్పడం ఏంటి ? ఎప్పటి నుండో పవన్ కు వీరాభిమాని కదా అనే కదా మీ డౌట్. శకలక శంకర్ పవన్ వీరాభిమాని అయితే ఆ మధ్య సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో పవన్ శకలక శంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దాంతో కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న శకలక శంకర్ ఇప్పటికి కూడా నా దేవుడు పవన్ కళ్యాణ్ అనే అంటున్నాడు. 

సినిమాల్లో మొదట చాన్స్ ఇప్పించింది నాగబాబు గారే నని దాని తర్వాత చాలా అవకాశాలు వస్తున్నాయని తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు శకలక శంకర్. అయితే పవన్ కు గుడి కడుతున్నానంటూ తెగ హడావుడి చేసిన శకలక శంకర్ ఇప్పుడు మాత్రం ఆ ఊసెత్తడం లేదు మరి. ఇక పవర్ స్టార్ ప్రస్తుతం ఎస్ జే సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -