హీరో అవ్వడం నా కొడుకుకి ఇంట్రెస్ట్ లేదు : రేణు దేశాయ్

1331
Pawan kalyan Son Akira Nandan Not Interested On Films
Pawan kalyan Son Akira Nandan Not Interested On Films

సినీ పరిశ్రమలో స్టార్స్ కిడ్స్ అంటే ప్రేక్షకుల్లో ఎప్పుడు ఆసక్తి ఉంటుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో తనయుడు అంటే మరింత ఎక్కువ ఆసక్తి ఉంటుంది. పవన్ కుమారుడు అకీరా నందన్ అంటే ఇప్పటికే మెగా అభిమానులకు ప్రత్యేకమైన అభిమానం. తండ్రికంటే చాలా పొడవుగా ఉన్న అకీరాను చూసి పవన్ అభిమానులు మురిసిపోతున్నారు. ఇదిలా ఉంటే ఈమధ్య అకీరా టాలీవుడ్ డెబ్యూ పై కొన్ని వార్తలు వచ్చాయి.

అన్నయ్య రామ్ చరణ్ అకీరాను లాంచ్ చేస్తునారని అన్నారు. అయితే ఈ విషయంపై రేణు దేశాయి స్పందిస్తూ “తనకు యాక్టర్ కావాలనే ఇంట్రస్ట్ ప్రస్తుతానికి లేదు. నేను అడిగితే ‘నాకు ఇంటరెస్ట్ లేదు’ అన్నాడు. ఇప్పటికైతే హీరో అయ్యేందుకు 1% ఇంట్రెస్ట్ కూడా చూపించడం లేదు. నేను కూడా బలవంతంగా అకీరాను అందులోకి పంపదలుచుకోలేదు. మా అబ్బాయి హీరో అయితే నాకు వచ్చేది లేదు పోయేది లేదు. అది అతని ఛాయిస్.. అతని డెస్టినీ” అంటూ క్లారిటీ ఇచ్చారు. అకీరాపై ఈ విషయంపై బయట నుంచి ప్రెజర్ ఉందన్న విషయం మాత్రం అంగీకరించారు.

“అకీరా పొడవుగా ఉండడంతో.. ప్రతి ఒక్కరు ‘ఈ అబ్బాయి హీరో అవుతాడు’ అంటున్నారు. నేను వారిని అలా చెప్పొద్దు అని ఆపుతున్నాను. తనపై ఒత్తిడి పెంచడం నాకు ఇష్టం లేదు” అన్నారు. అమ్మగా రేణు దేశాయి చెప్పిన మాటలు అర్థం చేసుకోవచ్చు. అయితే ‘ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ లేదు’ అని కదా.. మరో రెండు మూడేళ్ళు ఆగితే అకీరాకు సినిమాలపై ఇంట్రెస్ట్ రావచ్చేమో.. ఎందుకంటే పేరెంట్స్ ఇద్దరూ సినిమా రంగానికి సబంధించిన వారే కదా అని అభిమానులు అంటున్నారు. ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Loading...