Saturday, April 27, 2024
- Advertisement -

రాహుల్ కి గిఫ్ట్ ఇచ్చిన మహేష్.. ఏంటంటే ?

- Advertisement -

బిగ్ బాస్ మూడో సీజన్ వల్ల రాహుల్ కొన్ని సినిమాల్లో పాడే పాటలను వదిలేసుకున్నాడు. అందులో ప్రధానమైనది ’రాములో రాముల”. అల వైకుంఠపురంలో చిత్రంలోని ఈ సాంగ్ ముందుగా రాహుల్ చేత పాడిద్దామని అనుకున్నాడట తమన్. కానీ రాహుల్ బిగ్ బాస్ హౌస్ లో ఉండటంతో ఈ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి చేత పాడించారు. లేకుంటే ఈ సాంగ్ ను రాహులే పాడేవాడు. అయితే రాహుల్ చాలా సినిమాలు వదులుకుని హౌస్ లోకి వెళ్లినప్పటికి దేవుడు అతనిపై దయతలిచి.. బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ ని చేశాడు.

అందుకే అతనికి రెమ్యునరేషన్ తో పాటు 50 లక్షలు కూడా వచ్చాయి. కాకుంటే అల వైకుంఠపురంలో లోని రాముల రాముల సాంగ్ యూట్యూబ్ లో రికార్డుల బద్దలు కొడుతుంది. ఆ బాధ మాత్రం రాహుల్ కి కాస్త ఉందని తెలుస్తోంది. ఏది ఏమైన ఇప్పుడు రాహుల్ బిగ్ బాస్ సెలబ్రిటీ.. సో అతనికి విపరితమైన క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అతని క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు చూస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ కు ఊహించని గిఫ్ట్ వచ్చినట్లు తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అనిల్ రావుపూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో రాహుల్ చేత ఓ సాంగ్ పాడించేందుకు దేవి శ్రీ ప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇందుకు మహేష్ బాబు కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైన బిగ్ బాస్ తర్వాత మహేష్ సినిమా ఆఫర్ రావడం రాహుల్ అదృష్టమే అని చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -