Saturday, April 27, 2024
- Advertisement -

ప్రభాస్ తో శంకర్ మూవీ ?

- Advertisement -

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు ప్రభాస్. దాంతో ప్రభాస్ ఏం చేసిన ఓ సంచలనమే అవుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో మూవీ చేశాడు. కానీ ఈ సినిమా అనుకున్నంత ఆడలేదు. విమర్శలను ఎదుర్కొంది.

ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇది పిరియాడిక్ మూవీ. ఇకపోతే తమిళ సూపర్ డైరెక్టర్ శంకర్ తదుపరి సినిమాలో ప్రభాస్ నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కమల్ హాసన్ తో శంకర్ ఇండియన్ 2 సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే ప్రభాస్ తో సినిమా ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. శంకర్ సినిమా అంటే సరికొత్త కాన్సెఫ్ట్ తో భారీ బడ్జెట్ తో ఉంటుందన్న విషయం తెలిసిందే.

ప్రభాస్ జాతీయ గుర్తింపు పొందిన హీరో కాబట్టి శంకర్ తన తదుపరి సినిమా చేస్తారని అంటున్నారు. ఈ సినిమా దాదాపుగా 500 కోట్ల బడ్జెట్ తో శంకర్ తెరకెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మరోవైపు తమిళ స్టార్ హీరో విజయ్ తో కూడా శంకర్ సినిమా చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -