Friday, April 26, 2024
- Advertisement -

మహేష్ బాబుపైనే థమన్ కౌంటర్ వేశాడా ?

- Advertisement -

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇటీవలే వచ్చిన సినిమా అల వైకుంఠపురములో. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ దక్కించుకుని భారీ వసుళ్ళు సాధిస్తోంది. ఈ సినిమా బన్నీ, త్రివిక్రమ్ కు హ్యాట్రిక్ హిట్. ఈ చిత్రం సక్సెస్ క్రెడిట్ ను పూర్తిగా థమన్ కే కట్టబెడుతూ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కామెంట్స్ చేశారు.

ఇక వైజాగ్ లో జరిగిన సక్సెస్ వేడుకలో థమన్ మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన మాటలు ఇండైరెక్ట్ గా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాకు కౌంటర్ అన్నట్లుగా ఉన్నాయి అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. థమన్ మాట్లాడుతూ.. నిజమైన కలెక్షన్స్ చెబుతున్నాం.. ఈ రోజు గెలిచాం నిలిచాం మేము ఆపము అన్నాడు. ఆ మాటలకు అల్లు అరవింద్ మరియు త్రివిక్రమ్, అల్లు అర్జున్ గట్టిగా నవ్వడం జరిగింది.

నిజమైన కలెక్షన్స్ చెప్పాం అంటూ సరిలేరు నీకెవ్వరు సినిమాను థమన్ టార్గెట్ చేశాడు అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ప్రస్తుతం థమన్ ఈ స్థాయిలో ఉండటంకు కారణం ఎవరో గుర్తు తెచ్చుకోవాలంటూ గతం గుర్తు చేస్తున్నారు. మహేష్ బాబు దూకుడు మూవీకి మ్యూజిక్ అందించిక ముందు థమన్ ఎక్కడ ఉండేవాడో.. ఆ సినిమాకి మ్యూజిక్ ఇచ్చాక ఎన్ని పెద్ద సినిమాలు వర్క్ చేశాడో గుర్తు చేసుకోవాలంటూ మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో థమన్ వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. థమన్ కు లైఫ్ ఇచ్చింది మాత్రం ఖచ్చితంగా మహేష్ బాబు అని.. మహేష్ బాబుకు కౌంటర్ వేసే స్థాయి థమన్ కు లేదు అంటూ మహేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -