నిజామాబాద్‌లో రోడ్డు టెర్ర‌ర్‌…ముగ్గురు మృతి

377
3 persons killed as car hits a lorrey in Kamareddy
3 persons killed as car hits a lorrey in Kamareddy

తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. జిల్లాలోని సదాశివనగర్‌ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి క్రాసింగ్‌ వద్ద అదుపుతప్పిన కారు అదే రోడ్డులో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెంది ఎన్. రాజేశ్వర్ కుటుంబం చాలా కాలంగా వనస్థలిపురం హైకోర్టు కాలనీలో నివాసం ఉంటుంది. రాజేశ్వర్ కుటుంబంలో పాపకు అక్షరాభాస్యం చేయించేందుకు ఇవాళ ఉదయం హైద్రాబాద్ నుండి ఆదిలాబాద్ జిల్లా బాసరకు బయలు దేరారు.

అతివేగంగా వస్తున్న వీరి కారు క్రాసింగ్‌ వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అటువైపు రోడ్డువైపు దూసుకుపోయింది. అదే సమయంలో అటువైపు రోడ్డులో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. కారు బలంగా ఢీకొట్టడంలో లారీ డీజిల్‌ ట్యాంకు పగిలి మంటలు చెలరేగాయి. దీంతో లారీ అగ్నికి ఆహుతి అయ్యింది

ఈ ప్రమాదంలో రాకేష్‌ భార్య, బావమరిది, అత్త ఘటనా స్థలిలోనే చనిపోయారు. రాకేష్‌కు కుడి భుజం విరిగిపోగా, అతని కుమారుడు అభిరామ్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కామారెడ్డిలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పలు వివరాలు సేకరించారు.మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. లారీ డ్రైవర్‌ను విచారించి ప్రమాద కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Loading...