Saturday, April 27, 2024
- Advertisement -

నితి ఆయోగ్ సమావేశంలో జగన్..ప్ర‌త్యేక‌హోదా ఇవ్వాల్సిందే..

- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లోని సాంస్కృతిక కళా కేంద్రంలో నీతి ఆయోగ్ సమావేశం జ‌గ‌న్ కీల‌క స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తారు. జ‌గ‌న్‌కు ప‌ది నిమాలు కేటాయించారు. ఐదు నిమిషాల్లోనె జ‌గ‌న్ అద్భుతంగా రాష్ట్ర స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌నె డిమాండ్‌ను బ‌లంగా వినిపించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఒక నివేదికను ప్రధాని నరేంద్రమోదీతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రలు, నీతి ఆయోగ్ సభ్యుల ముందు ప్రవేశపెట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్షించి అన్ని రంగాల్లో తమను ఆదుకోవాలని కోరారు. గతంలో బీజేపీ తన మేజిఫెస్టోలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిని విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యే​క హోదా ఇస్తూ గత కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం కాపీని అందజేశారు. ప్రత్యేక హోదాను రద్దు చేయలేదని చెబుతూ.. ప్లానింగ్‌ కమిషన్‌ అబిజిత్‌ సేన్‌ లేఖను జతచేశారు.

14వ ఆర్థిక సంఘం 2015- 20 మధ్య ఏపీ రెవెన్యూ లోటును రూ.22,113 కోట్లుగా అంచనా వేసిందన్నారు. గత ఐదేళ్లలో తెలంగాణకు రూ.లక్షా 18వేల కోట్ల రెవెన్యూ మిగులు బడ్జెట్ ఉంటే గత ఐదేళ్లలో ఏపీ రెవెన్యూ లోటు 66,362 కోట్లుగా ఉందని తెలిపారు. 2015-16లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.14,414 అయితే ఏపీలో రూ.8,397 మాత్రమేనని సమావేశంలో ప్రస్తావించారు.

రాష్ట్ర విభజన నాటికి ఏపీకి రూ.97 వేల కోట్లు అప్పులు ఉంటే అవి కాస్త 2018 -19 నాటికి రూ.2లక్షల 58వేల కోట్లకు చేరాయని చెప్పుకొచ్చారు. ఏడాదికి రూ.20వేల కోట్ల వడ్డీ, రూ.20వేల కోట్ల అసలు చెల్లించాల్సి వ‌స్తోంద‌ని నీతి ఆయోగ్ స‌మావేశంలో వివ‌రించారు.రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకొని ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. హోదా ఇస్తే రాష్ట్రం నిలదొక్కుకుంటుందని సీఎం జగన్‌ తన నివేదికలో పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -