Friday, April 26, 2024
- Advertisement -

పథకాల అమలుపై స్పీడ్ పెంచిన సీఎం వైఎస్ జగన్…

- Advertisement -

వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలతోపాటు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చాలని నిర్ణయించారు. . వచ్చే నెల నుంచి పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన సం మ పథకాలను అమలు చేసే తేదీలను కూడా ప్రకటించారు.సెప్టెంబరు చివరి వారంలో సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకుంటున్న వారికి రూ. 10వేలకు ఇవ్వబోతున్నట్లు సీఎం చెప్పారు. దీనికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే ఏ డబ్బు అయినా పాత అప్పులకు జమ కాకుండా అన్‌ ఇన్‌కంబర్డ్‌ బ్యాంకు ఖాతాలు ఓపెన్‌ చేయించాలని సూచించారు.అక్టోబర్ 15న రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.రైతు భరోసా కౌలు రైతులకూ ఇస్తామని చెప్పాంమని.. దీనిపై రైతులకు, కౌలు రైతులను ఎడ్యుకేట్‌ చేయాల్సిన బాధ్యత గ్రామ వాలంటీర్లదన్నారు. అలాగే జనవరి 26న ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.

నవంబర్‌ 21న ప్రపంచ మత్స్య దినోత్సవం నిర్వహిస్తామని.. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు సంతృప్తికర స్థాయిలో పడవలు ఉన్నా, బోట్లు ఉన్నా రూ.10వేల చొప్పున ఇవ్వబోతున్నామన్నారు. వేట నిషేధ సమయం జూన్‌లో ముగిసినా.. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఇవ్వబోతున్నట్లు చెప్పారు.ప్రస్తుతం లీటర్‌పై రూ.6 సబ్సిడీ ఇస్తున్నామని.. దీన్ని రూ.9కు పెంచబోతున్నట్లు చెప్పారు.

మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24వేలు ఇస్తామని చెప్పామని.. ఈ హామీని అమలు చేయబోతున్నట్లు జగన్ తెలిపారు.ఫిబ్రవరి చివరి వారంలో షాపులున్న నాయీ బ్రాహ్మణులకు, షాపులున్న టైలర్లకు, షాపులున్న రజకులకు రూ.10వేలు ఇస్తామన్నారు. ఫిబ్రవరి చివరి వారంలోనే వైఎస్సార్‌ పెళ్లి కానుకనూ అమల్లోకి తీసుకు వస్తామని.. ప్రస్తుతం ఉన్న మొత్తాన్ని పెంచి ళ్లికానుకను ఇస్తామన్నారు.మార్చి చివరి వారంలోనే ఉగాది వస్తుందని.. అప్పుడే 25 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని తెలిపారు. స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -