Saturday, April 27, 2024
- Advertisement -

భయపడ్డ కేసీఆర్.. జగన్ డేరింగ్ స్టెప్..

- Advertisement -

ప్రభుత్వాలకు అత్యధిక ఆదాయం పంచే శాఖ రెవెన్యూ. అదే సమయంలో అత్యధిక అవినీతి జరిగేది ఈ శాఖలోనే.. క్షేత్ర స్థాయిలో భూములు, సర్టిఫికెట్లు, ప్రజల అవసరాలన్నీ ఈ రెవెన్యూశాఖతోనే ముడిపడి ఉంటాయి. అందుకే రెవెన్యూ అధికారులు లంచాల పేరిట కోట్లకు పడగలెత్తుతున్నారు. అలాంటి వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కేసీఆర్ నడుం బిగించారు.

రెండోసారి అధికారంలోకి రాగానే రెవెన్యూ వ్యవస్థను ఎత్తి వేసి పంచాయతీరాజ్ వ్యవస్థలో కలిపేసి అవినీతి లేని పాలన అందిస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి రెవెన్యూ ఉద్యోగులు షాకిచ్చారు. ఏకంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించడంతో కేసీఆర్ వెనక్కి తగ్గారు.. ఇప్పటికే రెవెన్యూ ప్రక్షాళన పక్కకు పోయింది.

అయితే ఏపీలోనూ ఇంతకు మించిన అవినీతి చరిత్ర రెవెన్యూ వ్యవస్థకు ఉంది. అందుకే తెలివిగా ఏపీ సీఎం జగన్ గ్రామ సచివాలయాల ఏర్పాటుతోపాటు గ్రామ వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. వారికి జీతాలిచ్చి గ్రామ పంచాయతీలో 10 మంది అందరూ అధికారులను నియమించి రెవెన్యూ వ్యవస్థను కట్టుబంధనం చేశారు. దీంతో అవినీతిని చేయకుండానే అరికట్టారు. అదే సమయంలో గ్రామ సచివాలయంలో యువతను నియమించి.. వలంటీర్లకు సంక్షేమ పథకాల బాధ్యతలను అప్పజెప్పడానికి నిర్ణయించారు.

ఇలా కేసీఆర్ చేయలేని పనిని జగన్ తెలివిగా కర్ర విరగకుండా పాము చంపేలా చేసిన ప్లాన్ ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తోంది. తెలివిగా వ్యవస్థలను బాగు చేసిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -