వెలిగొండకు పూర్వవైభవం.. సందర్శశించిన సీఎం జగన్

692
AP CM YS Jagan Mohan Reddy Visits Veligonda Project at Prakasam
AP CM YS Jagan Mohan Reddy Visits Veligonda Project at Prakasam

ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి వెలిగొండను సందర్శించారు. గురువారం ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టును సందర్శించి అక్కడే ప్రాజెక్టు పురోగతిపై సమీక్షించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2004లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి బీజం పడింది. ఈ ప్రాజెక్టు పనులు జరుగుతుండగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం చెందారు. నాటి నుంచి ప్రాజెక్టును పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి అయిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకు వెలుగులు తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి మళ్లీ ప్రణాళికలను రూపొందించారు. ఈ మేరకు గురువారం ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని తెలుసుకోనున్నారు.

జూన్ 15నాటికి తొలిదశ పనులు పూర్తి చేయాలని లక్ష్యం..
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెలిగొండ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. 2004లో ప్రారంభమైన వెలిగొండ ప్రాజెక్టుకు ఇప్పటివరకు ప్రభుత్వం 5,107కోట్లు ఖర్చు పెట్టింది. ఇంకా ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా 3,480కోట్లు అవసరం కానున్నాయి. ఇందులో తొలిదశ పూర్తి చేయడానికి 534 కోట్లు అవసరం. రెండోదశకు అవసరమైన 1880కోట్ల బడ్జెట్ ను వచ్చే బడ్జెట్ కేటాయించేందకు సిద్ధంగా ఉన్నారు. వెలిగొండలో మొత్తం రెండు సొరంగాల ద్వారా నీటిని ప్రాజెక్టులో నింపనున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 865.1 అడుగులు ఉంది. మార్చి 15నాటికి జలయాశం నీటిమట్టం 840కి తగ్గే అవకాశం ఉంది. అప్పుడే హెడ్ రెగ్యూలేటరీ పనులు చేయనున్నట్లు తెలుస్తోంది.

మూడు జిల్లాల రైతులకు లబ్ధి..
వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే మూడు జిల్లాల రైతులు లబ్ధి పొందనున్నారు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సాఆర్ కడప జిల్లాలోని 15.25లక్షల మందికి తాగునీరు అందడంతోపాటు, 4లక్షల47వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. వచ్చే వరద సీజన్ నాటికి రోజుకు 3వేల క్యూసెక్ ల నీరు తరలించాలని లక్ష్యం పెట్టకున్నారు. నల్లమల సాగర్ పునరావాసానికి 1220కోట్లు, తొలిదశ పూర్తి ప్రాజెక్టు పనులకు 534కోట్లు విడుదల చేసినట్లు తెలుస్తోంది. రైతుల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిన వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని వైఎస్ జగన్మోహన్ పనులను వేగవంతం చేస్తున్నారు. కాగా ప్రాజెక్టును సందర్శించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కలెక్టర్ పోల భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు.

Loading...