Friday, April 26, 2024
- Advertisement -

అక్క‌డ ఉండేది రాహుల్‌ కాదు….మ‌మ‌తా బెన‌ర్జీ…ప‌ప్పులు ఉడ‌క‌వు బాబు జాగ్ర‌త్త ..?

- Advertisement -

ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాలంటారు పెద్ద‌లు. ఇప్పుడు టీడీపీ ప‌రిస్థితికూడా అలాగానె ఉంది. రాష్ట్రంలో త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తాదో రాదో తెలియ‌దుగాని జాతీయ రాజ‌కీయీల్లో మాత్రం బాబు చ‌క్రం తిప్పాల‌ని తెగ అయాసా ప‌డుతున్నారు. భాజాపాను అధికారంలోకి రాకుండా చేయ‌డానికి ఎన్డీఏ కు వ్య‌తిరేకంగా ఉన్న రాజ‌కీయ పార్టీల‌ను ఒక‌తాటి మీద‌కు తెవాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నాలు బెడిసి కొడుతున్నాయి. జాతీయంగా త‌న ప్రాభ‌వాన్ని చూపించి చ‌క్కం తిప్పాల‌నుకుంటున్న బాబు స్పీడ్‌కు మ‌మ‌తా బెన‌ర్జీ బ్రేకులేశారు. దీంతో బాబు ఆశ‌లు అడియాశ ల‌య్యాయి.

మే 21న ప్రతిపక్ష పార్టీలతో ఢిల్లీలో ఓ సమావేశం ఏర్పాటు చెయ్యాలని చంద్రబాబు ఆశించారు. కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తుగా ఆరోజు ఎన్డీయేత‌ర పార్టీల‌న్నింటిని ఒక తాటి మీద‌కు తీసుకురావాల‌న్న బాబు వ్యూహానికి మ‌మ‌తా చెక్ పెట్టారు. ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న‌ట్లు ఇటు బాబుకు అటు కాంగ్రెస్‌కు హెచ్చ‌రిక‌లు పంపారు.

బెంగాల్‌లో రెంండ్రోజులపాటూ మమతా బెనర్జీ తరపున ప్రచారం చేసిన చంద్రబాబు… సమావేశం విషయాన్ని మమతా బెనర్జీతో గురువారం రాత్రి జరిగిన భేటీలో చర్చించారు. ఇద్ద‌రూ దాదాపు 45 నిమిషాల పాటు జాతీయ రాజకీయాలపై చర్చించారు.ఢిల్లీలో జరిగే సమావేశం 21న అనుకుంటే… ఫలితాలు వచ్చేది 23న. అంటే మధ్యలో గ్యాప్ ఒక్కరోజే. అంత తక్కువ టైంలో ఓ సమావేశం పెట్టుకోవడం మంచిది కాదన్నారు మమతా బెనర్జీ. ప్రస్తుతం పార్టీలన్నీ EVMలు, వీవీప్యాట్ల భద్రతపై దృష్టి సారించడం మంచిదన్న ఆమె… ఎన్నికల తర్వాతే కలుద్దామని చంద్రబాబుకి సూచించారు. ఇంకే ముంది తెల్ల‌మొహం వేసుకొని అక్క‌డ‌నుంచి వెనుతిరిగారు బాబుగారు.

21న ప్రతిపక్షాలతో మీటింగ్ జరిగితే, అప్పుడు మమతా బెనర్జీ ఆ పార్టీల కూటమితో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అది ఆమెకు ఇష్టం లేదని సమాచారం. ఎన్నికలకు ముందే ఇలా ఏదో ఒక కూటమిలో చేరిపోతే, ఆ తర్వాత తమ డిమాండ్లు నెరవేర్చుకోవడం సాధ్యం కాదని భావిస్తున్న మమతా బెనర్జీ ముందుగాల‌నె బాబు, కాంగ్రెస్ వ్యూహాల‌కు చెక్ పెట్టారు. ఏది ఏమైనా అక్క‌డ ఉండేది రాహుల్ కాదు….మ‌మ‌తా బెన‌ర్జీఅని తెలిసొచ్చింది బాబుగారికి. త‌న స్వార్థం కోసం రాజ‌కీయాలు చేస్తె ఫ‌లితాలు ఇలానె ఉంటాయి. ఇంట గెల‌వ‌కుండా జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌న్న బాబు రాజ‌కీయాలేంటో…? ఆయ‌న‌కే తెలియాలి. దీన్ని బ‌ట్టి చూస్తె బాబు ఒట‌మి మ‌మ‌త క‌ళ్ల ముందు క‌న‌బ‌డుతోంద‌న్న‌మాట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -