Friday, April 26, 2024
- Advertisement -

జ‌య‌రాం హ‌త్య కేసు : జూబ్లీహిల్స్ పోలీసుల క‌ష్ట‌డీలో సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన నిందితులు..

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ముఖ పారీశ్రామిక వేత్త చిగురుపాటి జ‌య‌రాం కేసు సంచ‌ల‌నం క‌లిగించింది. ఈకేసులో జ‌య‌రాం మేన‌కోడ‌లు శ్రిఖా చౌద‌రి ప్ర‌మేయం ఉంద‌నే ఆరోప‌న‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కేసు విచార‌ణ‌ను చేసిన‌ ఏపీ పోలీసులు శ్రిఖా ప్ర‌మేయం లేద‌ని చెప్పండంతో జ‌య‌రాం భార్య జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు పెట్టింది. దీంతో కేసును ఏపీ నుంచి తెలంగాణాకు బ‌దిలి చేశారు.కేసును విచారిస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌ను 3రోజుల పాటు త‌మ క‌ష్ట‌డీకి తీసుకున్నారు.బుధవారం నాడు చంచల్‌గూడ జైలు నుండి జూబ్లీహిల్స్ పోలీసులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిని తమ అదుపులోకి తీసుకొన్నారు.

ఇక్కడి నుండి నేరుగా బంజారాహిల్స్ ఏసీసీ ఆఫీసుకు తీసుకొచ్చారు. ఇతనితో పాటు శ్రీనివాస్‌ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ, బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. ఇదే విచార‌ణ‌లో వీరితో పాటు ఎక్స్ ప్రెస్ టీవీలో పనిచేసిన ఇద్దరు ఉద్యోగులను, టెట్రాన్ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. విచార‌ణ‌లో సంచ‌ల‌న నిజాలు చెప్పిన‌ట్లు స‌మాచారం. జ‌యరాంను హ‌త్య చేసిన త‌ర్వాత మృతదేహంతో నందిగామవెల్లారు. అక్క‌డ‌నుంచి హైద‌రాబాద్ జయరామ్ ఇచ్చిన రూ.6 లక్షలకు మరో రూ.4 లక్షలు కలిపానని పేర్కొన్నారు. మొత్తం రూ.10 లక్షలు తీసుకొని గోవా వెళ్లామని చెప్పారు.ఫిబ్రవరి 3న ఉదయం గోవా నుంచి హైదరాబాద్ కు వచ్చామని తెలిపారు. హైదరాబాద్ లో తనను నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -