Saturday, April 27, 2024
- Advertisement -

బాబు కరకట్ట అక్రమ నివాసం కూల్చివేతకు డేట్ ఫిక్స్ చేసిన సీఆర్ డీఏ

- Advertisement -

లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమమని తెలిసినా అందులో నివసిస్తున్న బాబు ఆఇంటిని ఖాలీ చేయకుండా నానాయాగి చేస్తున్నారు.సీఆర్ డీఏ అధికారులు ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా బాబు ససేమీరా అంటున్నారు. దాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధికోసం పాకులాడుతున్నారు. ఖాలీ చేయకుండా అక్కడే తిష్టవేసి ఉంటున్నారు. బాబు మొండి అయితే జగన్ జగమొండి అని బాబుకు ఇంకా తెలిసిరావాడంలేదు.

తాజాగా చంద్రబాబుకు సీఆర్డీఏ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు . ప్రస్తుతం చంద్రబాబు నివసిస్తోన్న లింగమనేని గెస్ట్ హౌస్ ను వారం రోజుల వ్యవధిలో ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేశారు. గతం లోను లింగమనేని గెస్ట్ హౌస్ కు నోటీసులు ఇచ్చిన సీఆర్డీఏ అధికారులు, ఇంటి యజమాని ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని , మరోసారి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది.

వారంరోజుల్లో ఇంటిని ఖాలీ చేయాలని లేకుంటే తదుపరి చర్యలు తప్ప వని సీఆర్ డీఏ వార్నింగ్ ఇచ్చింది . గతంలో ఇచ్చిన నోటీసుల వివరాల్ని కూడా ప్రస్తుతం ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఇంటిలో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న డ్రెస్సింగ్ రూమ్, స్విమ్మింగ్ ఫూల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారన్నారు. దీంతో చంద్రబాబు ఉంటున్న ఇల్లు అక్రమ కట్టడమని నిర్ధారణకు వచ్చామంటూ సీఆర్డీఏ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.

కృష్ణా నది కరకట్ట పై ఉన్న ఇతర అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వకుండా లింగమనేని గెస్ట్ హౌస్ కు మాత్రమే నోటుసులు అంటించారు. మిగిలిన ఇళ్లకు మాత్రం ఎటువంటి నోటీసులు జారీ చేయలేదని తెలుస్తోంది. వారంతా కోర్టుకెల్లి స్టేలు తెచ్చుకున్నట్లు సమాచారం. టీడీపీ అధికారం లో ఉన్న నాటి నుంచి గెస్ట్ హౌస్ అక్రమాలపై పోరాడుతున్న వైకాపా నేతలు, తాము అధికారం లోకి రాగానే ఈ గెస్ట్ హౌస్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు కన్పిస్తోంది .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -