Friday, April 26, 2024
- Advertisement -

వైఎస్ జగన్ ప్రమాణంలో సంచలన విషయాలివీ

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ప్రమాణం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో అశేష అభిమానుల మధ్య ముఖ్య అతిథులుగా కేసీఆర్, స్టాలిన్ రాగా గవర్నర్ నరసింహన్ జగన్ చేత ప్రమాణం చేయించారు.

జగన్ అనే నేను అని పలికే సమయంలో జగన్ క్షణం పాటు ఆగి సభవైపు చూసి చిరునవ్వు నవ్వారు. సరిగ్గా 12.23 గంటలకు జగన్ ప్రమాణం చేశారు.

*ఖడ్గచాలనం కాదు.. కరచాలనం: కేసీఆర్
ప్రమాణ స్వీకారం అనంతరం సభలో కేసీఆర్ మాట్లాడుతూ తెలుగు వారు కలిసి ఉంటే కలదు సుఖమని.. గోదావరి, కృష్ణా నీళ్లను వాడుకొని రెండు రాష్ట్రాలు సౌభాగ్యంగా ఉండాలని కోరారు. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన జగన్.. పెద్ద బాధ్యతను సమర్థంగా నిర్వహించాలని కోరారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తలపించేలా పాలన కొనసాగించాలని.. ఆయన వారసత్వాన్ని నిలబెట్టాలని ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి గా జగన్ వయసు చిన్నది అని.. బాధ్యత పెద్దది అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. బాధ్యతను నెరవేర్చే శక్తి ఉందని నిరూపించుకున్నారని కేసీఆర్ చెప్పారు. తండ్రి వైఎస్ శక్తి సామార్థ్యాలు జగన్ కు సంక్రమించాలని కేసీఆర్ కోరుకున్నారు. రెండు రాష్ట్రాలు ఖడ్డచాలనం చేయద్దని.. కరచాలనం చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు..

*తండ్రికి తగ్గ తనయుడు జగన్ : స్టాలిన్
ప్రమాణ స్వీకారం అనంతరం సభలో తొలుత మాట్లాడారు స్టాలిన్. ఈ సందర్భంగా తెలుగులో నమస్కారం పెట్టి.. జగన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. తండ్రి వైఎస్ అంతటి వాడు కావాలని కోరుకుంటూ ముగించారు. క్లుప్తంగా మాట్లాడి ముగించారు.

*ఏపీ ప్రజలపై వరాల జల్లు కురిపించిన జగన్
జగన్ తన ప్రమాణ స్వీకారం చేశాక ప్రసంగించారు. పాదయాత్రలో ప్రజల బాధలను ప్రత్యక్షంగా చూసినట్టు జగన్ గుర్తు చేసుకున్నారు. పాదయాత్రలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పెన్షన్ కేవలం 1000 రూపాయలు మాత్రమే ఉన్న విషయాన్ని గుర్తు చేసుకొని 3వేలకు పెంచుతానని హామీ ఇచ్చానన్నారు. ఈ హామీ మేరకే పెన్షన్ పెంచుతున్నానన్నారు. ఈ ఏడాది 2250తో మొదలు పెట్టి 3వేలకు ఐదేళ్లలో పెంచుతామన్నారు. తన తొలి సంతకాన్ని వైఎస్ఆర్ పెన్షన్ పథకంపైపెట్టారు. వృద్ధుల పెన్షన్ ను రూ..3వేల కు పెంచుతామని ప్రకటించారు.

ఆరు నుంచి ఏడాదిలోపే రాష్ట్రంలో అవినీతి లేకుండా చేస్తానని పై నుంచి కింది స్థాయి వరకు అవినీతి రహిత పాలనను అందిస్తానన్నారు. ఈ మేరకు రాష్ట్రస్థాయిలోనే జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు జగన్ ప్రకటించారు. అంతేకాదు.. స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తానన్నారు. 24గంటలు దాన్ని తానే పర్యవేక్షిస్తానన్నారు. వారు ప్రజల ఫిర్యాదులపై నేరుగా చర్యలు తీసుకుంటారన్నారు. అవినీతి ఎక్కడ జరిగినా పనులన్నీ రద్దు చేస్తామని.. అవినీతి రహిత పాలనను ప్రజలకు అందిస్తానన్నారు.

రివర్స్ టెండర్ ప్రక్రియను అమలు చేసి అవినీతి లేకుండా ప్రభుత్వ కాంట్రాక్టులు అప్పగిస్తామని జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరిగిందో అందరికీ తెలుసన్నారు. గత పాలనలో ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందన్నారు. అవినీతికి దూరంగా వైసీపీ పాలన ఉంటుందన్నారు. త్వరలోనే హైకోర్టు చీఫ్ జస్టిస్ ను కలిసి జ్యూడిషియల్ కమిషన్ వేసి సిట్టింగ్ జడ్జిని దానికి చైర్మన్ గా పెట్టి ఆ కమిషన్ సూచనల మేరకే కాంట్రాక్టర్లకు టెండర్లను పిలుస్తామని జగన్ హామీ ఇచ్చారు.

*ఆ వీడియాకు జగన్ హెచ్చరిక
టీడీపీ అనుకూల మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లకు ప్రమాణ స్వీకారం వేళ జగన్ హెచ్చరికలుపంపారు. .. చంద్రబాబు తప్ప వేరే ఎవ్వరికీ మద్దతు ఇవ్వని ఈ మూడు మీడియాలు.. ప్రతిపక్షాలను బతకనీయకుండా వార్తలు రాస్తాయని వాపోయారు. తమ ప్రభుత్వ పాలనపై, కాంట్రాక్టుల్లో పారదర్శకత పాటిస్తున్నామని.. దీంట్లో అవినీతిపై రాస్తే జ్యూడిషియల్ కమిషన్ తీసుకునే చర్యలు గురికాక తప్పదని టీడీపీ మీడియాలను హెచ్చరించారు. చంద్రబాబుకు బాకా ఊదే ఈ మీడియా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకోమని గట్టి హెచ్చరికలను జగన్ పంపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -