Friday, April 26, 2024
- Advertisement -

ఖ‌తువా ఘ‌ట‌న‌లో ఆరుగురిని దోషులుగా తేల్చిన ప‌ఠాన్ కోర్టు….

- Advertisement -

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కథువా అత్యాచార కేసులో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ స్పెషల్ కోర్టు సోమవారం తుది తీర్పు వెల్లడించింది. జ‌మ్మూక‌శ్మీర్‌లోని క‌తువాలో గ‌త ఏడాది 8 ఏళ్ల బాలిక‌ను దారుణంగా అత్యాచారం చేసిన సంగ‌తి తెలిసిందే. బాలిక‌ను రేప్ చేసిన కేసులో ఆరుగుర్ని దోషులుగా తేల్చారు. ఈ కేసులో మొత్తం ఏడు విచార‌ణ ఎదుర్కొన్నారు. అత్యాచార కేసులో ప్ర‌ధాన నిందితుడు పూజారి సంజీ రామ్‌ను దోషిగా తేల్చారు. ఆయ‌న కుమారుడు విశాల్‌ను మాత్రం నిర్దోషిగా ప్ర‌క‌టించారు.

వీరిలో ముగ్గురు పోలీసులు.. గ్రామ పెద్ద కూడా ఉన్నారు. దీంతో బాధిత కుటుంబం దోషులకు కఠిన శిక్ష విధించాలని కోరుకుటుంది. తమ చిన్నారిని అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి హతమార్చిన క్రూరమృగాలకు ఉరిశిక్షే వేయాలని డిమాండ్ చేస్తోంది.తీర్పు సంద‌ర్భంగా ఇవాళ కోర్టు వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

దోషుల‌కు ఎంత శిక్ష వేయాల‌న్న దానిపై మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు మ‌ళ్లీ వాద‌న‌లు చేప‌ట్ట‌నున్నారు. ఆరుగురు దోషుల‌పై మూడు సెక్ష‌న్లను విధించారు. సెక్ష‌న్ 201, 120 బి సెక్ష‌న్ల కింద ఆ ఆరుగుర్ని అరెస్టు చేశారు. క‌తువా అత్యాచార కేసులో దోషులుగా తేలిన వారిలో సాంజీ రామ్‌, ఆనంద్ ద‌త్త‌, ప్ర‌వేశ్ కుమార్‌, దీప‌క్ ఖాజురియా, సురేంద‌ర్ వ‌ర్మ‌, తిల‌క్ రాజ్‌లు ఉన్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -