Tuesday, March 19, 2024
- Advertisement -

బాల‌య్య‌ను వ‌ద‌ల‌నంటున్న కృష్ణ‌వంశీ

- Advertisement -

దర్శకుడు కృష్ణ వంశీ చాలా కాలం నుండి కొత్త సినిమా ఏది మొదలు పెట్టలేదు. అప్పట్లో నందమూరి బాలకృష్ణ తో రైతు అనే టైటిల్ తో ఒక సినిమా చేద్దాం అనుకునేటప్పటికి కొన్ని అనివార్య కారణాల వల్ల అది పట్టాలు ఎక్కలేదు. అయితే ఆ తరువాత చాలా మంది హీరోలతో సినిమా చేద్దాం అని ప్రయత్నించినా కృష్ణ వంశీ కి ఏ హీరో అవకాశం ఇవ్వకపోవటం నిరాశపరిచింది.

అయితే తాజా సమాచారం ప్రకారం కృష్ణ వంశీ మరి కొద్ది రోజుల్లో మరలా బాలకృష్ణ ని కలవనున్నారు అట. రైతు స్క్రిప్ట్ కి కొన్ని మార్పులు చేసిన కృష్ణ వంశీ ఈ సారి ఎలా అయిన సరే బాలకృష్ణ ను ఒప్పించి సినిమా చేయాలి అనే ప్రయత్నాలలో ఉన్నాడు అని తెలుస్తుంది. బాలకృష్ణ తో వరుసగా సినిమాలు చేస్తున్న సీ కళ్యాణ్ తో కృష్ణ వంశీ మంచి రాపొ మైంటైన్ చేస్తున్నట్లు ఫిలిమ్ నగర్ సమాచారం. అన్ని అనుకున్నట్లు గా జరిగితే ఈ ఏడాది చివరికల్లా ఈ సినిమా ని లైను లో పెట్టాలి అని కృష్ణ వంశీ భావిస్తున్నారు.

ఒకవేళ రైతు కనక వర్క్ ఔట్ అవ్వని పక్షం లో కృష్ణ వంశీ కొత్త వాళ్ళని పెట్టి ఒక సినిమా తీయనున్నడు అని ఫిలిమ్ నగర్ టాక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -