Thursday, May 2, 2024
- Advertisement -

పుకార్లు నమ్మకండి.. నా ఔషధానికి ఇంకా అనుమతులు రాలేదు : ఆనందయ్య

- Advertisement -

నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య తన ఔషధంపై సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆయన మందుపై విభిన్నమైన స్వరాలు వెలువడుతున్నాయి. మరోవైపు ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య తయారుచేస్తున్న ఔషధం పంపిణీ విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్టు గురువారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. శుక్ర‌వారం నుంచి ఆనంద‌య్య ఔష‌ధం పంపిణీ చేస్తార‌ని సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న పుకార్లు న‌మ్మ‌వ‌ద్ద‌ని తెలిపారు ఆనంద‌య్య‌.

తన ఔషధానికి ఇంకా ప్రభుత్వ అనుమతులు రాలేదని వెల్లడించారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం అని స్పష్టం చేశారు. శుక్రవారం నుంచి పంపిణీ పునఃప్రారంభం అంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దని వివరించారు. శుక్ర‌వారం ఆయ‌న వీడియో రూపంలో క‌రోనా మందు పంపిణీపై క్లారిటీ ఇచ్చారు. మందు పంపిణీపై ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి రాగానే తిరిగి పంపిణీ చేస్తామ‌ని.. ఆ విష‌యాన్ని అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేస్తామ‌న్నారు.

అప్ప‌టివ‌ర‌కు ఎటువంటి వాట్సాప్ మెసేజ్ లు న‌మ్మ‌వ‌ద్ద‌న్న ఆనంద‌య్య‌.. ప్ర‌స్తుతానికి త‌న ద‌గ్గ‌ర ఎటువంటి ఔష‌దం త‌యారికి సంబంధించిన ద్ర‌వ్యాలు లేవ‌న్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తేనే మందు పంపిణీ చేస్తానని, అయినా తనవద్ద ఇప్పుడు మూలికలు తగినంత స్థాయిలో లేవని అన్నారు. తాము ప్రకటించేవరకు ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఆనందయ్య స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ పేదల ఆకలి తీర్చిన యుగపురుషుడు : వైఎస్ షర్మిల

ఆనందయ్య గురించి బాలయ్య ఏమన్నాడంటే..!

కళ్యాన్ రామ్ ‘బింబిసార‌’ లుక్ అదుర్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -