పెద్దావిడ స‌మ‌స్య‌పై ట్విట్ట‌ర్‌లో స్పందించిన కేటీఆర్‌

253
Ktr respond on old women problem
Ktr respond on old women problem

తెలంగాణ మాజీ మంత్రి , టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తునే ఉన్నారు. గ‌తంలో చాలాసార్లు త‌న వ‌ద్ద‌కు చేరిన స‌మ‌స్య‌ల‌పై స్పందించి , వాటికి ప‌రిష్క‌రం చూపించారు. తాజాగా ఓ పెద్దావిడ కేటీఆర్‌కు త‌న స‌మస్య గురించి తెలియ‌జేసింది. సంగారెడ్డిజిల్లా కంది గ్రామానికి చెందిన మల్లేపల్లి నర్సమ్మ(70) తన భూమికి పాస్ బుక్ ఇవ్వకుండా అధికారులు 2 సంవత్సరాల నుంచి వేధిస్తున్నార‌ని ఆవేదన వ్యక్తం చేసింది. వీఆర్వో, ఎమ్మార్వోలు రూ.లక్ష లంచం ఇస్తేనే పాస్ బుక్ ఇస్తామని వేధిస్తున్నారని చెప్పుకొచ్చింది.

త‌మ‌ను ఎమ్మార్వో ఆఫీసు కూడా రానివ్వడం లేదనీ, న్యాయం చేయాలని కేటీఆర్‌ను కోరింది. మీరు కూడా స్పందించ‌క‌పోతే ఆత్మ‌హ‌త్యే త‌నకు శరణ్యమని కన్నీరు పెట్టుకున్నాంది. దీనికి సంబంధించిన వీడియోను యాదగిరి అనే వ్యక్తి ట్విట్టర్‌లో కేటీఆర్‌కు ట్యాగ్ చేశాడు. ఇది చూసిన కేటీఆర్ వెంట‌నే స్పందించారు. ఈ విష‌యంలో త్వ‌ర‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంగ‌రెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్‌ను ఆదేశించారు. కేటీఆర్ ఇలా ప్ర‌జ స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డంపై చాలామంది హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Loading...