Saturday, April 27, 2024
- Advertisement -

వీవీ ప్యాట్ల వ్యవహారంలో కాంగ్రెస్‌, టీడీపీల‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్‌….

- Advertisement -

50 శాతం వీవీ ప్యాట్స్‌ను లెక్కించాల‌ని టీడీపీతో స‌హా ఇత‌ర ప్ర‌తిప‌క్షాలు వేసిన పిటిషన్ విష‌యంలో సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. యంత్రాల్లో(ఈవీఎం) పోలైన ఓట్లను కనీసం 50 శాతం వీవీప్యాట్ స్లిప్పలతో సరిపోల్చాలని చంద్రబాబు నేతృత్వంలో 21 పార్టీలో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.

నియోజకవర్గంలో ఐదుశాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని ఇప్పటీకే ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో ఇచ్చిన ఆదేశాల్ని మార్చే ఉద్దేశ్యం లేదని సీజేఐ పేర్కొంది.50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని ప్రతిపక్షాలు గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీన్ని విచారించిన ధర్మాసనం.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీప్యాట్ యంత్రాలను ర్యాండమ్ గా లెక్కించాలని ఈసీని ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.

ఏపీలో ఎన్నికల అనంతరం ఈవీఎం ల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిరసన తెలిపారు. ఈసీకి లేఖ రాశారు. ప్రతి నియోజకవర్గంలో 50శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేశారు. దీనిపై 22 పార్టీలతో కలిసి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికలకు 75 రోజులు సమయం తీసుకోగా లేనిది.. స్లిప్పుల లెక్కింపునకు 6 రోజుల కేటాయిస్తే ఇబ్బంది ఏమిటి అని చంద్రబాబు ఈసీని ప్రశ్నించారు. చివ‌ర‌కు వీవీ ప్యాట్ల లెక్కింపు విషయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -