Tuesday, March 19, 2024
- Advertisement -

మీడియా ముందుకు వచ్చిన నూతన్ నాయుడు…

- Advertisement -

బిగ్ బాస్ టీవీ షో ఎంత ప్రాచుర్యం పొందిందో మన అందరికి తెలిసిన విషయమే. మొదటి సీజన్ లో శివ బాలాజీ విన్నర్ గా గెలిస్తే రెండవ సీజన్ లో కౌశల్ విన్నర్ గా నిలిచాడు. కౌశల్ విన్నర్ అయినప్పటికీ కౌశల్ సస్నేహితుడిగా చెప్పుకుంటూ తిరిగిన నూతన్ నాయుడు కి కూడా మంచి పేరు వచ్చింది. అయితే ఎన్నికలలో నిలబడుతాడు అని అందరూ భావించినా నూతన్ నాయుడు ఒక్క సారి గా ఎన్నికలు ప్రారంభం అయిన సమయానిక కనుమరుగైపోయాడు. తీరా చూస్తే నిన్న లగడపాటి రాజగోపాల్ పెట్టిన ప్రెస్స్ మీట్ లో నూతన్ నాయుడు లగడపాటి రాజగోపాల్ పక్కన నే దర్శనం ఇచ్చాడు.

బిగ్ బాస్ 2 సీజన్ సమయం లో సామాన్యుడిగా కార్యక్రమం లోకి ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు ప్రస్తుతం లగడపాటి రాజగోపాల్ క్యాంప్ లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఆయనకి చెందిన అర్ జీ ఫ్లాష్ టీం లో నూతన్ నాయుడు ఒక ముఖ్య పాత్ర పోషించిన సమాచారం. ఈ సారి ఎన్నికలకు సంబంధించి సర్వే అంతటినీ దగ్గర ఉండి చుసుకునట్టుగా మీడియా లో టాక్ నడుస్తుంది. ఏది ఏమైనా కానీ క్రమ క్రమంగా నూతన్ నాయుడు రాజకీయాలలో తన పలుకుబడిని పెంచుకుంటున్నారు అని అనడం లో ఎటువంటి సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -